యష్-షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ మూవీ..? డైరెక్టర్ ఎవరంటే..?

By Mahesh Jujjuri  |  First Published Jan 30, 2024, 2:37 PM IST

కాంబినేషన్లు ఎప్పుడు ఎలా కలుస్తాయో చెప్పడం కష్టం. అసలుమనం ఊహించని కాంబోలు వెండితెరపై సందడి చేస్తుంటాయి. తాజాగా అలాంటి కాంబినేషన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 


 
ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యష్. కేజీఎఫ్ సినిమాలు తన కెరీర్ నే మలుపు తిప్పాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది.దాంతో యష్ ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. అయితే కెజియఫ్ తరువాత వచ్చిన గ్యాప్.. యష్ కు కాస్త మైనస్ గా మారింది. త్వరలో సినిమాను ప్రకటించలేదు స్టార్ హీరో.  

చాలా గ్యాప్ తరువాత నిరాశలో ఉన్న ఫ్యాన్స్ ఆశలకు చిగురిస్తూ.. యష్  ఒక సినిమా ప్రకటించాడు. ఈ సినిమా తో పాటు వరుస సినిమాలు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అందులో బాలీవుడ్ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి.   ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నాడు కన్నడ స్టార్ హీరో.  ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఆ తర్వాత నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం సినిమాలో నటించనున్నాడని టాక్. ఇందులో రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, విజయ్ సేతుపతి నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈసినిమాలో యష్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడట. 

Latest Videos

ఈ క్రమంలోనే యష్ ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఈమూవీ తెరకెక్కుతోందని.. ఇందులో షారుఖ్ ఖాన్ కూడా యష్ తో స్క్రీన్ శేర్ చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో యష్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి పని చేయాలనీ ఉందని తెలిపాడు. దాంతో ఇప్పుడు షారుక్ కూడా యష్ తో కలిసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అయితే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం వెయిట్ ఈ ఇద్దరూ ఎదురుచూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. వైరల్ అవుతున్న వార్తలు తెలుసుకుని యష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .

ఈ ఇద్దరు స్టార్స్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి వీరు ఇద్దరు వెండితెరపై కనిపించాలి అటే కథ ఏ రేంజ్ లో ఉండాలి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి.. ఇవన్నీ ప్రస్తుతం అందరూ ఆలోచిస్తున్న విషయాలు. ఇక యష్ కొత్త ప్రాజెక్ట్ కోసం షారుక్ ఖాన్ తో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని టాక్. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అనేది అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ వేచి చూడాల్సిందే. 

click me!