ముప్పై ఏళ్లు దాటాయి...ప్రభాస్ ఏమన్నా చిన్నపిల్లవాడా! : కృష్ణం రాజు

Published : Jun 25, 2018, 05:20 PM ISTUpdated : Jun 25, 2018, 05:24 PM IST
ముప్పై ఏళ్లు దాటాయి...ప్రభాస్ ఏమన్నా  చిన్నపిల్లవాడా! : కృష్ణం రాజు

సారాంశం

ప్రభాస్ ఏమన్నా చిన్నపిల్లవాడా

ప్రభాస్ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సీనియర్ నటుడు, ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అతనే (ప్రభాస్) ఆలోచించుకోవాలి.. ముప్పై ఏళ్లు దాటాయి.. ఏమైనా చిన్నపిల్లవాడా. పెళ్లి చేసుకో? ఎప్పుడు చేసుకుంటావు? అని అడుగుతూనే ఉంటాం. ‘పెళ్లి చేసుకుంటాను’ అని చెబుతాడు.

ఇప్పుడు.. మా కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే.. కొడుకుని ఐదు సంవత్సరాల వయసు వరకు దేవుడిలా చూడాలట. ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వరకు బానిసలా చూడాలట. పద్దెనిమిదేళ్ల లోపు దారిలో పెట్టాలి. పద్దెనిమిదేళ్ల తర్వాత స్నేహితుడిలా చూడాలట’ అని అన్నారు. ప్రభాస్ ఆర్టిస్ట్ గా ఎదిగాడని,‘బాహుబలి’ సినిమా ప్రధాని మోదీకి బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. ‘సాహో’ సినిమా తర్వాత ప్రభాస్ తో తమ సొంత బ్యానర్ పై ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు చెప్పారు. జూలై, ఆగస్టులలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని అన్నారు.

PREV
click me!

Recommended Stories

అక్షయ్ కుమార్ 25వ వెడ్డింగ్ యానివర్సరీ.. భార్యతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూశారా, వైరల్ వీడియో
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత ప్రదీప్ రంగనాథన్ మాస్ సర్ప్రైజ్..ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లతో రొమాన్స్