
ఎపిసోడ్ ప్రారంభంలో నేను రేపు వెళ్ళిపోతున్నాను అంటుంది కృష్ణ. ఎందుకు అంటాడు మురారి. నా తప్పుని రుజువు చేసుకోలేకపోయాను కదా అందుకే అంటుంది కృష్ణ ఎక్కడికి వెళ్తావు అని మురారి అంటే మా ఊరికి వెళ్ళిపోతాను ఉంటుంది కృష్ణ. ఏ ఇక్కడ మీ గౌతమ్ సార్ ఉన్నారు కదా అంటాడు మురారి ఆయన దొరకలేదు కదా అంటుంది కృష్ణ.
గౌతమ్ సర్ దొరకలేదు కాబట్టి నువ్వు మీ ఊరు వెళ్ళిపోతున్నావు అంతేనా అంటాడు మురారి. అంతే అంటుంది కృష్ణ. అసలు నీ మనసులో ఏముందో చెప్పు అంటాడు మురారి. నాకున్న ఒకే ఒక ఆశ గౌతమ్ సర్ ఆయనే కనిపించడం లేదు ఏం చేయాలి అంటూ అమాయకంగా అడుగుతుంది కృష్ణ. మరోరకంగా అర్థం చేసుకున్న మురారి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.
అలా ఎందుకు వెళ్లిపోయాడు అర్థం కాక అయోమయంగా మొహం పెడుతుంది కృష్ణ. మీ ఇంటికి ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోతున్నాను కానీ గుండె మాత్రం భారంగా అయిపోతుంది ఏసీబీ సార్ ని వదిలి రావాలంటే ఏదోలాగా ఉంది కానీ తప్పదు అని తండ్రి ఫోటో కి చెప్పుకుంటుంది కృష్ణ. మరోవైపు ఫోన్ రింగ్ అవుతున్న లిఫ్ట్ చేయడు గౌతమ్. ఎందుకు తనని అంత ఇబ్బంది పడుతున్నావు నీ ప్రాబ్లం లోకి కృష్ణని లాగుతున్నావు.
నువ్వు ఇచ్చిన టాబ్లెట్ వల్ల వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అయింది అని చెప్తాడు మరొక డాక్టర్. ఊహించాను అంటాడు గౌతమ్. తెలిసే ఇవన్నీ చేస్తున్నావా నీకోసం పిచ్చిదాని లాగా నెలుకుతుంది. కృష్ణ నావల్ల బాధపడకూడదు తనకి నిజం చెప్తే మురారి కి చెప్పేస్తుంది ఏమో అని భయపడ్డాను కానీ తన కాపురానికి ఎసరు వస్తుంది అంటే చూస్తూ ఊరుకోను తనని ఇంక టెన్షన్ పెట్టను అంటాడు గౌతమ్.
మరోవైపు బట్టలు సర్దుకుంటూ మురారితో తను గడిపిన ఆనందమైన క్షణాలని తలుచుకుంటుంది కృష్ణ. మరోవైపు బట్టలు సర్దుకుంటున్న కృష్ణ అని ఏం చేయటం ఎలా ఆపడం. గౌతమ్ వచ్చిన తర్వాతే కృష్ణ పూర్తిగా మారిపోయింది అనుకుంటాడు మురారి. అతను కూడా కృష్ణ తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటాడు. ఇంతలో గౌతమ్ పంపించిన వాయిస్ మెసేజ్ వింటుంది కృష్ణ.
నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నీ అత్తింటితో ముడిపడిన ఒక విషయాన్ని మీతో చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా రేపు పొద్దున్న రా అని ఆ మెసేజ్ సారాంశం. గౌతమ్ సర్ నాకు ఊపిరి ఇచ్చారు అంటూ ఆనంద పడిపోతుంది కృష్ణ. ఇంట్లో అనుకోకుండా వచ్చిన కృష్ణ నాకు మురారి కి అడ్డుగోడగా ఉండేది. ఇప్పుడు తను ఇంట్లోంచి వెళ్ళిపోతుంది.మంచి రోజులు వస్తాయని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు అంటూ ఆనంద పడిపోతుంది ముకుంద.
కిందికి వచ్చిన కృష్ణ నేను ఇప్పుడు వెళ్ళటం లేదు అని చెప్పి అందరికీ షాక్ ఇస్తుంది. ఒక గంటలో బయటికి వెళ్లి వస్తాను అప్పుడు వెళ్ళిపోతాను అంతవరకు పర్మిషన్ ఇవ్వండి అంటుంది కృష్ణ. ఆవు పులి కథ చెప్తున్నావా అంటూ కోప్పడుతుంది భవాని. రాత్రి వెళ్ళిపోతాను అన్నావు మళ్లీ ఇప్పుడు ఇదేంటి ఒక మాట మీద నిలకడగా ఉండవా అంటుంది ముకుంద. నేను అత్యవసరంగా బయటికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది.
నేను మాట ఇస్తున్నాను మీరు ఉండమన్నా ఉండను అంటుంది కృష్ణ. నందిని తోనే ఉండి ఇతని ఆరోగ్య ని బాగు చేస్తానని చెప్పి ఇప్పుడు తన ప్రాణాల మీదకు తెచ్చావు అంటుంది భవాని. నాకు పూచికత్తుగా మీరు ఉండగలరా అని మురారిని అడుగుతుందికృష్ణ. అతను ఏమీ మాట్లాడకపోవడంతో నామీద నీకు నమ్మకం లేదా అని అడుగుతుంది. లేదు అంటూ కచ్చితంగా చెప్తాడు మురారి.
అంత నమ్మకద్రోహం నేనేం చేశాను అంటుంది కృష్ణ. అది నీ అంతరాత్మకు తెలుసు అంటాడు మురారి. నా అంతరాత్మ ఎప్పుడో చచ్చిపోయింది. పెళ్లి చేసుకొని ఈ గుమ్మంలో అడుగుపెట్టినప్పుడే నా అంతరాత్మ చచ్చిపోయింది. మా నాన్నకి పెళ్లి ప్రదానం చేసిన రోజు నాకు ఇంట్లో శిక్ష వేసిన రోజు నా అంతరాత్మ చచ్చిపోయింది. ఇప్పుడు పదేపదే ఇంట్లోంచి వెళ్ళమని అందరూ అంటుంటే మీరు మాట్లాడటం లేదు చూశారా ఇప్పుడే ఈ క్షణమే నేను పూర్తిగా చచ్చిపోయాను.
ఒక జీవస్త్సవం లాగా అడుగుతున్నాను ఒక్క గంట బయటికి వెళ్లి రావటానికి పర్మిషన్ ఇప్పించండి అని మురారిని బ్రతిమాలుతుంది కృష్ణ. ఇప్పించలేను అంటాడు మురారి. నా కొడుకు పర్మిషన్ ఇప్పించలేడు ఎందుకంటే వాడు కూడా ఈ ఇంటి రక్తమే కదా అంటుంది రేవతి. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ భార్యని మందలిస్తాడు ఈశ్వర్. నేను నా కొడుకు గురించి మాట్లాడుతున్నాను మధ్యలో అడ్డు రావద్దు అంటూ నా కొడుకు ఆదర్శ పురుషుడు భార్య ఆకలితో ఉండటం చూసి బయటికి తీసుకెళ్లి భోజనం పెట్టించాడు.
అలా ఎందుకు చేసావుంటే అది నా బాధ్యత అని చెప్పిన నీతిమంతుడు. కానీ ఒకటి అర్థం కావడం లేదు నీ భార్యని ఇంట్లోంచి గెంటేస్తుంటే ఇప్పుడు ఎందుకు నీ బాధ్యత నీకు గుర్తు రావటం లేదు అని కొడుకుని నిలదీస్తుంది రేవతి. కనీసం ఒక గంట పర్మిషన్ కూడా ఇప్పించలేకపోతున్నావు ఎందుకో నాకు అర్థం కావటం లేదు అంటుంది. దానికి సమాధానం నేను చెప్తాను.
నీ కొడుకు నా చేతుల్లో పెరిగాడు అందుకే నాకులాగా క్రమశిక్షణకు అలవాటు పడ్డాడు అంటుంది భవాని.తరువాయి భాగంలో మీలో ఇంకొక మనిషి ఉన్నాడు భార్య పరాయి మగవాడితో మాట్లాడితేనే సగటు మగాడు మగాడు. మీ అహంకారానికి తలదించడానికి నేను సిద్ధంగా లేను అని కన్నీరు పెట్టుకుంటూ బయటికి వెళుతుంది కృష్ణ.