
యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల చేశారు. దాస్ కా ధమ్కీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఇది సినిమాకు ప్లస్ అయ్యింది. ఈ కారణంగానే దాస్ కా ధమ్కీ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా. దాస్ కా ధమ్కీ చిత్రానికి దర్శకుడు, నిర్మాత కూడా విశ్వక్ సేన్ కావడం విశేషం. తన వద్ద ఉన్నవన్నీ ఊడ్చి ఈ చిత్రం చేశానని ఆయన వెల్లడించారు.
దాస్ కా ధమ్కీ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి గెస్ట్స్ గా వచ్చారు. ఈ సందర్భంగా తమ మార్క్ ఎంటర్టైన్మెంట్ పంచారు. ఓ స్కిట్ లో యాక్ట్ చేసిన విశ్వక్ సేన్ యాంకర్ రష్మీ గౌతమ్ కి ఝలక్ ఇచ్చాడు. రామ్ ప్రసాద్ తన స్కిట్ లో విశ్వక్ సేన్ ని భాగం చేశారు. విశ్వక్ సేన్ రష్మీని ఉద్దేశిస్తూ 'ఏంటి రష్మీ లాంగ్ డ్రైవ్ కి వెళదామా?' అన్నాడు. దానికి సంబరపడిపోయిన రష్మీ 'ఓ... యస్' అంది.
వెంటనే ఆమెకు షాక్ ఇస్తూ ..' నువ్వు వెళ్ళు నేను రాను' అన్నాడు. రామ్ ప్రసాద్ హీరో విశ్వక్ కోసం ఆటో పంచ్ రాశాడు. అది విశ్వక్ సేన్ యాంకర్ రష్మీ మీద సంధించాడు. విశ్వక్ సేన్ సెటైర్ కి రష్మీ ముఖం మాడ్చుకోగా సెట్ లో ఉన్నవాళ్లందరూ గొల్లున నవ్వేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు కూడా పాల్గొన్నారు. కుష్బూ, కృష్ణభగవాన్ జడ్జెస్ గా వ్యవహరించారు.
కొత్తగా ఒకప్పటి లేడీ కమెడియన్ వాసుకి అలియాస్ పాకీజా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె రైజింగ్ రాజుతో పాటు ఓ స్కిట్ చేశారు. వాసుకి చాలా కాలంగా ఆర్థిక కష్టాలు పడుతున్నారు. ఇటీవల ఆమె దీనగాథ వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ ప్రముఖులు కొందరు ఆర్థిక సహాయం చేశారు. తమిళనాడుకు చెందిన పాకీజా 250కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో అసెంబ్లీ రౌడీ ఆమెకు పాపులారిటీ తెచ్చింది. ఆ చిత్రంలో వాసుకి చేసిన పాకీజా రోల్ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.