Krishna Mukunda Murari: కోడల్ని వెనకేసుకొస్తున్న భవాని.. ముకుంద కి గట్టి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ!

Published : Mar 03, 2023, 11:52 AM IST
Krishna Mukunda Murari: కోడల్ని వెనకేసుకొస్తున్న భవాని.. ముకుంద కి గట్టి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ!

సారాంశం

Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తుంది. దీంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతూ అందర్నీ అలరిస్తుంది. ఇక ఈ రోజు మార్చి 3 ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో ముకుంద టిఫిన్ చేస్తావా అని రేవతి అడుగుతుంది. నేను వెళ్లి పెద్దత్తయ్యని టిఫిన్ కి పిలుస్తాను అనుకుంటూ వెళ్ళిపోతుంది. అంతలోనే కృష్ణ వచ్చి కంగారుగా టిఫిన్ ఇప్పటికే లేట్ అయింది అంటుంది కృష్ణ. మరోవైపు గౌతమ్ ఫోన్ చేయటంతో లేదు సార్ బయలుదేరి పోయాను అంటూ కంగారుగా భర్తని పిలుస్తుంది  కృష్ణ. ఎందుకలా కేకలు వేస్తున్నావు ఇదేమైనా ఇల్లు అనుకున్నావా బజార్ అనుకున్నావా అయినా వచ్చేవరకు ఆగలేవా అంటూ కేకలు వేస్తుంది భవాని.

టైం అయిపోయింది అత్తయ్య అంటుంది కృష్ణ. ఈ భయం ముందే ఉండి ఉంటే త్వరగా లేచి తనకు చేసుకునే దానివి అంటుంది భవాని నాదేమీ లేట్ లేదు, ఎసిపి సర్ దే లేటు అంటుంది కృష్ణ. ఈరోజు అంటే ఓకే కానీ ప్రతిరోజు పికప్ లు డ్రాపింగ్లు అంటే మురారి కి అవదు కదా రేపటి నుంచి ఏ క్యాబ్ అయినా బుక్ చేసుకుని వెళ్ళు అంటుంది ముకుంద. లేట్ అయితే మా సీనియర్ ఒప్పుకోరు అని కోపంగా చెప్తుంది కృష్ణ. వెళ్లాలి అంటే ఎలాగైనా వెళ్లొచ్చు మురారినే రావక్కర్లేదు అంటుంది  భవాని.

మురారి రావటం ఇంకా ఆలస్యం అవ్వటంతో అతనికి వెళ్తున్నట్లు గా మెసేజ్ పెట్టి వెళ్ళిపోతుంది కృష్ణ. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వాడి పెళ్ళాన్ని వాడు డ్రాప్ చేయడంలో తప్పేముంది  అంటాడు ప్రసాద్. కృష్ణ తో పెట్టుకుంటే మురారి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోయేవాడు అందుకే ముకుందా అలా చెప్పింది అంటూ కోడల్ని వెనకేసుకొస్తుంది భవాని. నేను రెడీ అంటూ కిందికి వస్తాడు మురారి. తను వెళ్ళిపోయింది అని చెప్తే నేను డ్రాప్ చేసే వాడిని కదా అంటాడు మురారి.

రోజు నువ్వు ఎందుకు డ్రాప్ చేయడం ఎందుకు తను వెళ్లలేదా అంటుంది భవాని. తనకి ఒంటరిగా వెళ్లడం అలవాటు అవ్వాలి కదా అంటుంది ముకుంద. సరే పదండి టిఫిన్ చేద్దాం అనుకుంటూ అందరూ బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్తారు. మరోవైపు హాస్పిటల్ కి లేటుగా వచ్చిన కృష్ణని కోపంగా చూస్తాడు గౌతమ్. అంతలోనే మురారి ఫోన్ చేయడంతో నలుగురిలో ఉన్నానని కూడా మర్చిపోయి మీరు డ్రాప్ చేయకపోవడం వల్ల నాకు లేట్ అయింది ఇప్పుడు నా సీనియర్స్కి సిల్లీ రీసన్స్ చెప్పాలి అంటూ కోప్పడుతుంది.

ఆమె మీద కోప్పడతాడు గౌతమ్. పక్కనే ఉన్న డాక్టర్ కి తను డ్యూటీకి అలవాటు కాలేదు కొంచెం ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. మరోవైపు బయలుదేరుతున్న కొడుకు దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది రేవతి. ఏమైంది అని అడుగుతాడు మురారి. నీ ప్లాటి క్యాపు మర్చిపోయి వెళ్ళిపోతున్నావు అంటుంది రేవతి. ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను అని చెప్పి అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి.

ఇదంతా పైనుంచి చూస్తున్న ముకుంద అంతలా ఏమి ఆలోచిస్తున్నాడు అనుకుంటుంది. మరోవైపు మురారి కృష్ణ ఇచ్చిన పెన్ చూసుకొని ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతో ఇబ్బంది పడుతూ వెళ్ళిందో నన్ను నమ్ముకుని వచ్చినందుకు తనని సరిగ్గా చూసుకుంటున్నానా అనుకుంటాడు. మరోవైపు మురారి ఎందుకంత పరధ్యానంగా ఉన్నాడు. మురారి కృష్ణ మీద చూపిస్తున్నది జాలి, మానవత్వమా, ప్రేమ ఏంటది ఈరోజు రాత్రి కల్లా ఏ విషయం తెలుసుకోవాలి అనుకుంటుంది ముకుంద.

మరోవైపు ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడలేదు అంతలాగా హర్ట్ అయిందా అయినా నా తప్పేముంది గౌతమ్ సారి ఫోన్ చేశారని తనేగా వెళ్లిపోయింది. నాకన్నా తనే ముఖ్యమైపోయాడు అనుకుంటూ మళ్లీ కాల్ చేస్తాడు. కరెక్ట్ గా అదే టైం కి గౌతం పక్కన ఉంటుంది కృష్ణ. వెంటనే కంగారుగా కాల్ కట్ చేసేస్తుంది. మళ్లీ ఫోన్ చేయటంతో అవసరం లేదు నేను వచ్చేస్తాను అని వాయిస్ మెసేజ్ పెడుతుంది. అందుకు ఆమె మీద కోప్పడతాడు గౌతమ్. మరోవైపు హాల్లో వెయిట్ చేస్తున్న ముకుందని చూసి మురారి ఇంటికి వచ్చేసినా ఈవిడ గారు ఎవరి కోసం ఎదురుచూస్తుంది అనుకుంటుంది రేవతి.

ముకుంద ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు ఉంది, తను ఎదురు చూడ్డానికి ఎవరుంటారు  అంటుంది సుమ. ఎవరికోసం ఎదురు చూస్తున్నావ్ అని అడిగితే కృష్ణ రావాలి అంటుంది ముకుంద. తనతో నీకేమైనా పని ఉందా అని అడుగుతాడు ప్రసాద్ కానీ ఎంతసేపు ఎందుకు బయట ఉండి పోయిందో అర్థం కాలేదు అంటుంది ముకుంద. ఎందుకు అంత ఆరా తీస్తున్నావు నీ బాధ ఏంటి ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిది ఉంటుంది రేవతి. ఇదే పని నేను చేస్తే మీరు అలాగే ఊరుకునేవారా అంటుంది ముకుంద.

తను ఎక్కడికి వెళ్లిందో తెలుసు ఎందుకు వెళ్ళిందో తెలుసు అంటుంది రేవతి. ఆ మాటలకి అడ్డుపడిన భవాని ఇప్పుడు చీకటి పడే లోపు ఇంటికి రావాలి కదా అంటుంది భవాని. అక్కడ ఎంత బిజీగా ఉందో ఏంటో అంటూ కోడల్ని వెనకేసుకొస్తుంది రేవతి అప్పుడే కృష్ణ ఇంటికి రావడంతో ఎందుకు ఇంత అలసిమైంది అంటూ నిలదీస్తుంది భవాని. హాస్పిటల్లో కొత్తగా జాయిన్ అయ్యాను కదా నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ మా కొలీగ్స్ ని అడిగి తెలుసుకుంటున్నాను అంటుంది కృష్ణ.

ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం చీకటి పడక ముందే  రావాలి అంటుంది భవాని. అక్కడ ఫోటోలు గాని క్యాబ్స్ కానీ అంత త్వరగా దొరకవు అంటుంది కృష్ణ. నువ్వు జూనియర్ డాక్టర్ వి అప్పుడే నీవల్ల పేషంట్లందరూ బ్రతికి పోతున్నట్లు మాట్లాడుతున్నావ్ ఏంటి అంటుంది ముకుంద. నేను అలా ఎందుకు మాట్లాడుతాను అంటుంది కృష్ణ. ఆర్గుమెంటు అవసరమా త్వరగా వస్తాను అని ఒక మాట చెప్పొచ్చు కదా అంటుంది భవాని. అలా ఎలా చెప్పగలను క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఒక పేషెంట్ కి వస్తే జూనియర్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అంటుంది కృష్ణ.

నీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను త్వరగా రావడానికి ప్రయత్నించు కుదరకపోతే మురారి ఫోన్ చెయ్యు అంటుంది భవాని. మనం వాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడినా తనకి తన అత్తగారికి అంతగా రుచించదు అంటుంది ముకుంద. మీ అత్తగారు, మా అత్తగారు అంటావేంటి చిన్న అత్తయ్య పెద్దయ్య అనలేవా అంటుంది  కృష్ణ. అయినా రేవతి అత్తయ్య నిన్ను ఏమన్నారు అంటుంది కృష్ణ. నీ తింగరి తను నా దగ్గర చూపించొద్దు అంటుంది ముకుంద. నువ్వు ఎవరితో ఎలా మాట్లాడినా నాతో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడు అంటుంది ముకుంద.

 నా గురించి ఎలా మాట్లాడినా పట్టించుకోను కానీ అత్తయ్య గురించి మాట్లాడితే మాత్రం జాగ్రత్తగా మాట్లాడు అంటుంది కృష్ణ. వాళ్ల ఆర్గ్యుమెంట్ ని ఆపమంటూ గట్టిగా అరుస్తుంది రేవతి. నేనా గొడవ పెట్టుకున్నాను అంటుంది కృష్ణ. నువ్వు ప్రేమతో నన్ను చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు అంటుంది ముకుంద. అలసిపోయి వచ్చిన పిల్లతో ఆర్గ్యు చేసింది నువ్వు ఇంటి కోడలు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో చెప్పటానికి మా అక్క ఉన్నారు అంటుంది రేవతి. నాకేమీ హక్కు అధికారం లేదా అంటుంది ముకుంద. మీ ఇంట్లో పెద్దత్తయ్య తర్వాత అందరూ అందరికీ సమానమే.

నేను ఆవిడ నా సేఫ్టీ  కోసమే చెప్పారు నేను కూడా అలాగే అన్నాను. ఆ తర్వాత నేను సమాధానం చెప్పుకోవాల్సింది ఏసీపీ సర్ కి మాత్రమే ఆయన అడిగితే నేను సమాధానం చెప్తాను. నేను ఊరు నుంచి వచ్చినా చదువుకొని డాక్టర్ని అయ్యాను ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు అంటుంది కృష్ణ. తరువాయి భాగంలో కృష్ణ ని పిలుస్తాడు మురారి. నాకు కిందకి రావాలని లేదు ఏసిపి సర్ ఇక్కడే ఈ గదిలోనే మీతోనే ఉంటే బాగుంటుందనిపిస్తుంది అంటుంది. తనకి భోజనం తినిపిస్తుంటాడు మురారి. అదంతా దొంగచాటుగా చూస్తుంది ముకుంద.

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ