Krish:అటు పవన్ తో,ఇటు తారకరత్నతో...క్రిష్

Surya Prakash   | Asianet News
Published : May 15, 2022, 11:43 AM IST
Krish:అటు పవన్ తో,ఇటు తారకరత్నతో...క్రిష్

సారాంశం

 తాజాగా రిలీజైన ఈ టీజర్ లో  ద‌క్క‌న్ ఇంపీరియ‌ల్ బ్యాంక్ కోఠి 95 అనే బోర్డ్ ఆస‌క్తిని పంచుతోంది. ముసుగు ధరించి చేతిలో తుపాకులతో కనిపిస్తున్న కొందరు వ్యక్తులతో పోలీస్ డ్రెస్ లో వెన‌క్కి తిరిగిన మరొకరు కనిపిస్తున్నారు. అత‌డెవ‌ర‌న్న‌ది ఆస‌క్తిని పంచుతోంది.  


పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు చిత్రానికి  ప్రముఖ దర్శకుడు క్రిష్  దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే అదే సమయంలో  క్రిష్ తన  డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రయత్నాలను వదిలిపెట్టడం లేదు. గతంలోనూ తమ మ్యానర్ పై ఆయన ఓటిటి సినిమాలు, సీరిస్ లు నిర్మించారు. తాజాగా ఆయన షో రన్నర్ గా 9అవర్స్ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.   ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ  వెబ్‌సిరీస్‌కు క‌థ‌ను అందిస్తున్నారు. 9 అవ‌ర్స్ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో తార‌క‌ర‌త్న‌,అజ‌య్‌,మ‌ధుశాలిని,వినోద్‌కుమార్,శ్రీతేజ్ ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ సీరిస్ టీజర్ తాజాగా రిలీజైంది. ఇంట్రస్టింగ్ గా ఉండటంతో వైరల్ అవుతోంది. మీరూ ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు ఓ భారీ దొంగతనానికి ప్లాన్ చేయడమనే పాయింట్ తో ఈ సిరీస్ రూపొందుతోంది. జైలు నుంచి తప్పించుకున్న వాళ్లు ఓ బ్యాంకులోకి చొరబడిన తర్వాత జరిగే పరిణామాలతో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా రిలీజైన ఈ టీజర్ లో  ద‌క్క‌న్ ఇంపీరియ‌ల్ బ్యాంక్ కోఠి 95 అనే బోర్డ్ ఆస‌క్తిని పంచుతోంది. ముసుగు ధరించి చేతిలో తుపాకులతో కనిపిస్తున్న కొందరు వ్యక్తులతో పోలీస్ డ్రెస్ లో వెన‌క్కి తిరిగిన మరొకరు కనిపిస్తున్నారు. అత‌డెవ‌ర‌న్న‌ది ఆస‌క్తిని పంచుతోంది.

పీరియాడికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ సిరీస్ జూన్ 2 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నది. ఈ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?