Dhoni:ధోనికి నయనతార హీరోయిన్ , క్లారిటి ఇచ్చిన టీమ్

Surya Prakash   | Asianet News
Published : May 15, 2022, 10:55 AM IST
Dhoni:ధోనికి నయనతార హీరోయిన్ ,  క్లారిటి ఇచ్చిన టీమ్

సారాంశం

ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా నయనతార చేయనుందన్న వార్తల పైన ధోని ఎంటర్ టైన్మెంట్ టీమ్ స్పందించింది. 

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని  నిర్మాతగా సినిమా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఓ వార్త ఇటీవల వైరల్ అయ్యిన తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అన్న టాక్ కూడా వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌ సన్నిహితుడు సంజయ్‌ మొత్తం ఇదంతా పర్యవేక్షిస్తున్నాడు అన్నారు. ధోనీ తొలి చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోందని... ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన రావచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నెలలోనే.. అంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. దాంతో ధోని ప్యాన్స్, నయనతార అభిమానులు సోషల్ మీడియాలో పండుగ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అందులో నిజం లేదంటున్నారు.

ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా నయనతార చేయనుందన్న వార్తల పైన ధోని ఎంటర్ టైన్మెంట్ టీమ్ స్పందించింది. దయచేసి ఇలాంటి పుకార్లని నమ్మొద్దని, ప్రస్తుతానికి తమ టీమ్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తోందని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. దీనితో నయనతారతో ధోని సినిమా నిర్మించనున్నాడనే వార్తలు నిజం కాదని తెలిసిపోయింది. కాగా నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సినిమాలో నటిస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టీం కి సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో ఐపీఎల్ ఫార్మేట్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతున్న ధోని… తమిళ అభిమానానికి బాగా దగ్గరయ్యాడు.   ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రారంభంలో వరుస పరాజయాలు.. మూట కట్టుకుంది. ప్రారంభంలో ఈ సీజన్ లో జట్టుకి జడేజా నాయకత్వం వహించారు. ఇంత వరుస పరాజయాలు ఎదురుకావడంతో.. ధోని సీజన్ మధ్యలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే దిశగా ధోని తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?