పవన్ కల్యాణ్ తో క్రిష్...ఈ సారి పక్కా

Published : Oct 20, 2017, 03:28 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
పవన్ కల్యాణ్ తో క్రిష్...ఈ సారి పక్కా

సారాంశం

పవన్ కల్యాణ్ కోసం కథ రెడీ చేసిన క్రిష్ గతంలోనే పవన్ కల్యాణ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రాజెక్ట్ వుండే అవకాశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఫుల్ ఫాలోయింగ్ వుండే హీరోతో సినిమా చెయ్యాలని ప్రతీ డైరెక్టర్ కు వుంటుంది. స్టార్ హీరోతో సినిమా అంటే అందరికీ ఒక సౌలభ్యం ఉంటుంది. ఆ హీరో ని కొత్తగా చూపిస్తే తమ మార్కెట్ రేంజ్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఏ హీరో దృష్టిలో పెట్టుకుని ఏ డైరెక్టర్ కథ రాస్తున్నాడనేది చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ నే టార్గెట్ గా చేసుకుని కథ రాస్తున్నాడు అని తెలుస్తోంది. గ‌మ్యం, వేదం, కృష్ణంవందే జ‌గద్గురుమ్‌, గౌత‌మిపుత్ర‌…. ఇలా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ఓమార్క్ సృష్టించుకొన్నాడు క్రిష్‌. ఇప్పుడు బాలీవుడ్‌లో కంగన లీడ్ రోలల్ లో ఝాన్సీ రాణి పాత్రలో మ‌ణిక‌ర్ణిక చిత్రం రూపొందిస్తున్నాడు.

 

ఆ తరవాత తెలుగులో ఒక సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు దాని కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాడు క్రిష్. క్రిష్ కూడా 'కంచె' సినిమాకు ముందు పవన్‌తో సినిమా చేయడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ఎలాగైనా సంపాదించాలని కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు క్రిష్. ఈ ఏడాది 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంతో సక్సెస్ అందుకున్న క్రిష్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో చారిత్రక నేపధ్యం గల 'మణికర్ణిక' సినిమాను తెరకెక్కిస్తున్నాడు.



ఈ సినిమాతో బాలీవుడ్‌కు తన సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నాడు. ఈ సినిమా తరువాత క్రిష్ చేయబోయే సినిమా తెలుగులోనే అని తెలుస్తోంది. ఆయన తదుపరి సినిమా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఉంటుందనే మాటలు వినిపించాయి. మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే దర్శకుడు క్రిష్ అని అంతా అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు క్రిష్.. పవన్ సినిమాకు కూడా కథను సిద్ధం చేస్తున్నాడని టాక్. తన కథతో పవన్‌‌ను మెప్పించి అతడి అంగీకారం పొందాలని చూస్తున్నాడు.
 

అయితే ప్రస్తుతం పవన్.. త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో సినిమా లైన్‌లో ఉంది. మరోవైపు 2019 ఎన్నికల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి సమయాన్ని పాలిటిక్స్‌ పై పెట్టేందుకు ప్రణాళికలు రచించుకున్నారు. వీలైనంత తొందరకు షెడ్యూల్ అయిన మూవీలను కంప్లీట్ చేసి రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు కొత్త సినిమాలేవీ పవన్ ఒప్పుకునే పరిస్థితిలేదు. మరి క్రిష్ చెప్పిన కథ పవన్‌కు అటు రాజకీయంగానూ ఉపయోగపడుతుందని అందుకే ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చంటూ వార్తలు వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌