సైరా ఆలస్యానికి అసలు కారణం ఆయనేనట

Published : Oct 20, 2017, 03:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
సైరా ఆలస్యానికి అసలు కారణం ఆయనేనట

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న సైరా నరసింహారెడ్డి సురెందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సైరా కు నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ దిపావళికి ప్రారంభించాలనుకున్నా మరింత ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాడు. ఈ చిత్ర నిర్మాతగా మాంచి సక్సెస్ సాధించిన రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మరోసారి తలపెట్టిన భారీ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా అట్టహాసంగా మొదలైన సైరా సినిమా ఇంకా ఒరిజినల్ షూటింగ్ మొదలు అవ్వకపోవడం తో మెగా ఫాన్స్ తో పాటు చిత్ర పరిశ్రమ లో కూడా చాలా నెగెటివ్ మాటలు వినపడుతూ ఉన్నాయి.

 

మెగా ఫాన్స్ ఒకపక్క రోజూ ట్విట్టర్ ఫేస్ బుక్ లో రామ్ చరణ్ కీ అతని కొణిదెల ప్రొడక్షన్ బృందానికీ మెసేజ్ లు పెడుతూ ఉండగా మరికొందరు దీపావళి కంటే ముందర ముహూర్తాలు లేకపోవడం వల్లనే టైం లేట్ అయ్యింది అని అంటున్నారు. మ‌రోవైపు సెట్స్ కూడా సిద్దం కాలేదు. స్వాతంత్ర్యోద్య‌మం కాలంనాటి వాతావ‌ర‌ణం ప్ర‌తిబింబించేలా సెట్స్‌ని రూపొందించాల్సి వ‌చ్చింది. అందుకోసం కాస్త రీసెర్చ్ కూడా చేయాల్సివుంది. కాస్ట్యూమ్స్, ఆయుధాల రూప‌క‌ల్ప‌న వీటి కోసంఎక్క‌వ స‌మ‌యం కేటాయించారు. అందుకే `సైరా` సైర‌న్ మోగ‌డానికి టైమ్ ప‌ట్టింది.

 

ఇప్పుడు సైరా షూటింగ్ మొదలుపెట్టడానికి కావాల్సినదంతా రెడీ అయిపోయింది. ఇక చిరుదే ఆల‌స్యం. దీపావ‌ళి పండుగ చేసుకొని, మ‌రుస‌టి రోజు షూటింగ్ మొద‌లెట్టాల‌ని చిత్ర‌బృందం భావించింది. అంటే..ఈ రోజే క్లాప్ కొట్టాల‌న్న‌మాట‌. అయితే చిరంజీవి నుంచీ ఇంకా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. చిరు ఖైదీ సినిమా టైంకి కాస్త బరువు తగ్గి సన్నబడ్డారు కానీ ప్రస్తుతం కాస్త లావుగా కనపడుతున్నారు.

 

సైరా లాంటి భారీ చిత్రానికి ఎలాంటి లోపం లేకుండా లుక్ వుండాలని చిరు భావిస్తున్నారట. అందుకే మరి కొంత సమయం తీసుకునైనా సరే బాడీని మాంచి యంగ్ లుక్ వచ్చేలా షేప్ చేసి అప్పుడు సైరా అనాలని చూస్తున్నారట. సో కొన్ని వారాల నుంచీ కొనసాగుతున్న డైట్ తో పాటు ఆయన స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ వున్న ఫిట్ నెస్ ట్రిక్స్ అన్నీ ఫాలో అవుతూ మరి కొన్ని వారాల్లో బరువు తగ్గేలా ఉన్నారు. సైరా పాత్రకు త‌గ్గ‌ట్టు జుట్టు కూడా భారీగా పెంచుతున్నారట. సైరా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ని తాను మ‌ల‌చుకొన్న త‌రువాతే… సైరా సెట్లో అడుగుపెడ‌తార‌ట చిరంజీవి.

PREV
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?