
గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం తరువాత, క్రిష్ మరో చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. 'ఝాన్సీ లక్ష్మీబాయి' జీవిత చరిత్రను తెరకెక్కించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. 'ఝాన్సీ లక్ష్మీబాయి' అసలు పేరు 'మణికర్ణిక' కావడం వలన, ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు.
కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించడానికి రంగంలోకి దిగింది. ఈ సినిమా టైటిల్ లోగో బయటికి వచ్చిన తరువాత వివాదం చెలరేగింది. తాను 2015లోనే 'రాణి ఆఫ్ ఝాన్సీ' కథను గురించి కంగనాతో మాట్లాడాననీ, అప్పుడు ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకారాన్ని తెలిపిందని దర్శకుడు కేతన్ మెహతా అన్నారు. ఇప్పుడు అదే కథలో మరో దర్శకుడితో కలిసి పనిచేయడానికి కంగనా రెడీ అవుతోందంటూ ఆయన నోటీసులు పంపించారు. ఈ వివాదం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో.