క్రిష్ ఇప్పుడేం చేస్తున్నాడంటే...

Published : Apr 04, 2019, 09:23 AM IST
క్రిష్ ఇప్పుడేం చేస్తున్నాడంటే...

సారాంశం

వరసగా రెండు పెద్ద డిజాస్టర్స్ ఎంతటి గొప్ప డైరక్టర్ ని అయినా వెనకబడేలా చేస్తాయి. అప్పటిదాకా వెనకబడ్డ నిర్మాతలను, హీరోలను దూరం జరిగేలా చేస్తాయి. 

వరసగా రెండు పెద్ద డిజాస్టర్స్ ఎంతటి గొప్ప డైరక్టర్ ని అయినా వెనకబడేలా చేస్తాయి. అప్పటిదాకా వెనకబడ్డ నిర్మాతలను, హీరోలను దూరం జరిగేలా చేస్తాయి. అదే క్రిష్ కు జరిగింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు భాక్సాఫీస్ వద్ద చతికిల పడటం క్రిష్ కు కెరీర్ పరంగా పెద్ద దెబ్బే కొట్టింది. మరో ప్రక్క బాలీవుడ్ చిత్రం మణికర్ణిక సైతం వివాదాలతో ఆయనకు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం ఏ హీరోతో చెయ్యబోతున్నారు..అనేది చర్చనీయాంశంగా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు ఆయన మీడియాకు కొద్ది కాలం పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే మహానాయకుడు రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ లో కూడా కనపడలేదు. ఇప్పుడు తన రచయిత బుర్రా సాయి మాధవ్ తో కలిసి కూర్చుని స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు. అయితే ఆ స్క్రిప్ట్ ని ఎవరికోసమని తెలియరాలేదు. అఖిల్ , మోక్షజ్ఞ లను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని, ఎవరికి నచ్చితే వారితో ముందుకు వెళ్లవచ్చని ఆలోచనగా చెప్తున్నారు. 

తెలుగులో పెద్ద హిట్ కొట్టాక, బాలీవుడ్ కు వెళ్దామని ఫిక్స్ అయ్యారట. ఎప్పటిలాగే తనదైన శైలిని ప్రతిబింబేచేలా కథ,కథనం రెడీ చేస్తున్నాడని యంగ్ హీరోలకు మాత్రమే ఆ కథ పనికివస్తుందని చెప్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరికీ కథ నచ్చకపోతే అప్పుడు వేరే స్క్రిప్టుపై దృష్టి పెడదామని ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?