మెగాస్టార్ ఎవరికోసం రావట్లేదు.. 2019 పొలిటికల్ టచ్ లేనట్లే!

Published : Apr 03, 2019, 08:22 PM ISTUpdated : Apr 03, 2019, 08:26 PM IST
మెగాస్టార్ ఎవరికోసం రావట్లేదు.. 2019 పొలిటికల్ టచ్ లేనట్లే!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా పాలిటిక్స్ కి  దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల వరకు కాంగ్రెస్ లో ఉన్న చిరంజీవి మెల్లమెల్లగా పార్టీ కార్యక్రమాలను దూరం పెడుతూనే ఉన్నారు. ఇకపోతే ఇటీవల మెగాస్టార్ మళ్ళీ ఎలక్షన్ ప్రచారాల్లో బిజీ కానున్నట్లు టాక్ వచ్చింది. 

ఈ విషయంపై ఆరా తీస్తే.. అలాంటిదేమి లేదని మెగాస్టార్ సన్నిహితులు వివరణ ఇచ్చారు. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన మెగా బంధువు కావడం వల్ల మెగాస్టార్ ప్రచారాల్లో బిజీ కానున్నట్లు టాక్ వచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ అధికార ప్రతినిధి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా మూవీ షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నారని అందుకే ఆయన పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉన్నట్లు వివరణ ఇచ్చారు. అదే విధంగా ఎలక్షన్స్ ప్రచారాల్లో మెగాస్టార్  ఎవరికోసం రావడం లేదని, ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా స్టార్ 2019 పాలిటిక్స్ ని దాదాపు దూరం పెట్టినట్లే అని అర్ధమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, శ్రీలీల ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ అదిరింది.. కానీ ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?
Rashmika Mandanna: స్వేచ్ఛనిచ్చే ప్రేమను వెతుక్కోండి.. రష్మిక మందన్న పోస్ట్ వైరల్