మరో వివాదంలో క్రాక్ నిర్మాత... దర్శకుడు గోపీచంద్ ఫిర్యాదు!

By team teluguFirst Published Feb 6, 2021, 12:07 PM IST
Highlights

క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం ఇవ్వలేదట. కొంత భాగం మాత్రమే ఠాగూర్ మధు ఆయనకు చెల్లించడం జరిగిందట. సినిమా విడుదలయ్యి నెల రోజులు కావస్తున్నా... తనకు రావాల్సిన బకాయి మొత్తం చెల్లించకపోవడంతో గోపీచంద్ ఫిర్యాదు చేయడం జరిగింది. దర్శకుల అసోసియేషన్ గోపీచంద్ ఫిర్యాదు తీసుకోవడంతో పాటు చర్యలకు సిద్దమైనట్లు సమాచారం. 
 

క్రాక్ మూవీ ఇచ్చిన ఆనందం దర్శకుడుకి ఎంతో కాలం నిలవలేదు. ఆయనకు రావలసిన రెమ్యూనరేషన్ దక్కకపోవడంతో దర్శకుల కౌన్సిల్ నందు అయన ఫిర్యాదు చేయడం జరిగింది. విషయంలోకి వెళితే రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం క్రాక్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. రవితేజ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన క్రాక్ రూ. 50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ క్రాక్ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 

కాగా ఈ మూవీ నిర్మాత ఠాగూర్ మధు దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం ఇవ్వలేదట. కొంత భాగం మాత్రమే ఠాగూర్ మధు ఆయనకు చెల్లించడం జరిగిందట. సినిమా విడుదలయ్యి నెల రోజులు కావస్తున్నా... తనకు రావాల్సిన బకాయి మొత్తం చెల్లించకపోవడంతో గోపీచంద్ ఫిర్యాదు చేయడం జరిగింది. దర్శకుల అసోసియేషన్ గోపీచంద్ ఫిర్యాదు తీసుకోవడంతో పాటు చర్యలకు సిద్దమైనట్లు సమాచారం. 

విడుదల తేదీ నాడు సైతం క్రాక్ మూవీ వివాదంలో చిక్కుకుంది . ఠాగూర్ మధు గతంలో తమకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయంటూ, కోర్టు ద్వారా క్రాక్ విడుదలను ఓ సంస్థ అడ్డుకోవడం జరిగింది. జనవరి 9న క్రాక్ విడుదలపై పెద్ద హై డ్రామా నడువగా... చర్చల అనంతరం సాయంత్రం షోల నుండి క్రాక్ విడుదల కావడం జరిగింది. 
 

click me!