నాంది ట్రైలర్: నా జీవితం ఇంతటితో ముగిసిపోలేదు.. ఇప్పుడే మొదలైంది!

By team teluguFirst Published Feb 6, 2021, 11:00 AM IST
Highlights

ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా నరేష్ విజయాలు అందుకోవడంలో కామెడీ చిత్రాలు దోహదం చేశాయి. ప్రస్తుతం నరేష్ కి ఆ జోనర్ అచ్చి రావడం లేదు. దీనితో ఆయన ఓ సీరియస్ సబ్జెక్టు టచ్ చేస్తూ నాంది చిత్రం చేయడం జరిగింది.

కామెడీ స్టార్ గా 50కి పైగా సినిమాలు చేశాడు అల్లరి నరేష్. తనకంటూ ప్రత్యేకమైన జోనర్ సెట్ చేసుకొని దూసుకుపోతున్న అల్లరి నరేష్ కి వరుస పరాజయాలు బ్రేక్ వేశాయి. ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా నరేష్ విజయాలు అందుకోవడంలో కామెడీ చిత్రాలు దోహదం చేశాయి. ప్రస్తుతం నరేష్ కి ఆ జోనర్ అచ్చి రావడం లేదు. దీనితో ఆయన ఓ సీరియస్ సబ్జెక్టు టచ్ చేస్తూ నాంది చిత్రం చేయడం జరిగింది. చేయని నేరానికి ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా నరేష్ సీరియస్ రోల్ చేస్తున్నారు.

 పోలీసులు, పొలిటీషియన్స్ కారణంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్న ఖైదీ కథనే నాంది చిత్రం. డబ్బు, పలుకుబడి, హోదా ఉన్నవారు తమ ప్రయోజనాల కోసం చట్టాన్ని ఉపయోగించుకొని అమాయకులను ఎలా బలి చేస్తున్నారో నరేష్ పాత్ర ద్వారా తెలియజేశారు. జైల్లో చిత్ర హింసలు అనుభవించే ఖైదీగా నరేష్ నటన అద్భుతం అని చెప్పాలి. ఇక నరేష్ ని కాపాడే లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ ట్రైలర్ లో ఆకట్టుకున్నారు. 

మొత్తంగా నాంది ట్రైలర్ చూస్తుంటే వెండితెరపై ఓ కొత్త నరేష్ ఆవిష్కృతం అవుతాడనిపిస్తోంది. 'అందరూ నా జీవితం ఇంతటితో ముగిసింది అనుకుంటున్నారు... కానీ ఇప్పుడే మొదలైంది' అని నరేష్ చెప్పడం వాస్తవంలో ఆయన కెరీర్ కి కూడా సూట్ అయ్యేలా ఉంది. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇక ఫిబ్రవరి 19న నాంది గ్రాండ్ గా విడుదల కానుంది. 

click me!