బిగ్ అప్డేట్: ప్రేమికుల రోజు కానుకగా రాధే శ్యామ్ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో

Published : Feb 06, 2021, 09:15 AM IST
బిగ్ అప్డేట్: ప్రేమికుల రోజు కానుకగా రాధే శ్యామ్ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో

సారాంశం

ప్రేమికుల రోజు నాడు అమర ప్రేమికుడిగా ప్రభాస్ ని పరిచయం చేస్తున్నాం అంటూ మేకర్స్ తెలియజేశారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రాధే శ్యామ్ నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేయనున్నారు.


ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఆయన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ పై బిగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ప్రేమికుల రోజు నాడు అమర ప్రేమికుడిగా ప్రభాస్ ని పరిచయం చేస్తున్నాం అంటూ మేకర్స్ తెలియజేశారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రాధే శ్యామ్ నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేయనున్నారు. ఇప్పటిదాకా మాస్ ప్రభాస్ ని చూసిన మీకు, అమర ప్రేమికుడిని పరిచయం చేయబోతున్నాం అంటూ ఓ స్పెషల్ వీడియోతో పాటు అప్డేట్ ఇచ్చారు. 

ఇటలీ నగర వీధుల్లో మంచు కురుస్తుండగా... ప్రేయసిని తలచుకుంటూ నడిచివెళుతున్న ప్రభాస్ లుక్ కట్టిపడేసింది. సంక్రాంతి కానుకగా రాధే శ్యామ్ నుండి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే ఎటువంటి అప్డేట్ మేకర్స్ విడుదల చేయకపోవడంతో నిరాశ చెందారు. దీనితో ప్రేమికుల రోజు నాడు ఊహించని గిఫ్ట్ ప్రభాస్ తన ఫ్యాన్స్ కోసం సిద్ధం చేయడం జరిగింది. 
యువ దర్శకుడు రాధా కృష్ణ ఇటలీ నేపథ్యంలో నడిచే పీరియాడిక్ లవ్ స్టోరీగా రాధే శ్యామ్ తెరకెక్కిస్తున్నారు.

 ప్రభాస్ గత చిత్రాలకు భిన్నంగా సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. ఇక రాధే శ్యామ్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఓ కీలక రోల్ చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్