బిగ్ బాస్ కౌశల్.. జవానుల కుటుంబాలకు విరాళం

By Prashanth MFirst Published 20, Feb 2019, 5:30 PM IST
Highlights

టాలీవుడ్ లో గత ఏడాది బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో కౌశల్ మండా ఒకరు. బిగ్ బాస్ సెకండ్ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలిచిన అతనికి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కౌశల్ ఆర్మీ అంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ యాక్టర్ ఇటీవల సోషల్ సర్వీస్ అంటూ జనాలను  మరింతగా ఆకర్షిస్తున్నాడు. 

ఇకపోతే పుల్వామా ఘటనపై టాలీవుడ్ స్టార్స్ చేస్తోన్న సాయంలో కౌశల్ కూడా తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించాడు. 49 CPRF జవానులు ఇటీవల ఉగ్రదాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైనిక కుటుంబాలకు  సినీ తారలు ఆర్థిక విరాళాలు అందిస్తుండగా కౌశల్ ఆర్మీ తరపున కౌశల్ మండా 50 వేల రూపాయలను ప్రకటించారు. 

ఈ ఉదయం హైదరాబాద్ IGని స్పెషల్ గా కలుసుకున్న కౌశల్ 50 వేల రూపాయాల చెక్ ను అందించారు. కౌశల్ సతీమణి కూడా భర్తతో చెక్ ను ఆర్మీ కుటుంబాల కోసం పంపించాల్సిందిగా అధికారులను కోరగా IG కౌశల్ ని ప్రత్యేకంగా అభినందించారు. 

Last Updated 20, Feb 2019, 5:30 PM IST