సింగర్ పై లైంగిక దాడి చేశా.. క్షమించండి: మ్యూజిక్ డైరెక్టర్

Published : Oct 12, 2018, 02:40 PM IST
సింగర్ పై లైంగిక దాడి చేశా.. క్షమించండి: మ్యూజిక్ డైరెక్టర్

సారాంశం

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇటీవల కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రఘు దీక్షిత్ ఆమె చేసిన ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. 

హాలీవుడ్ లో మొదలైన మీటూ పదం నేడు ఇండియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ఈ  మధ్య కాలంలో బయటపడినంతంగా ఎప్పుడు బయటపడలేదు. నటీనటుల నుంచి సింగర్స్ వరకు అందరూ వారికి జరిగిన అన్యాయం గురించి దైర్యంగా చెబుతున్నారు. 

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇటీవల కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రఘు దీక్షిత్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒకసారి ఇంటికి పిలిచి తోటి స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్థించాడని చెప్పడంతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీలో ఆ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే రఘు దీక్షిత్ ఆమె చేసిన ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. 

"నేను లైంగిక దాడి చేసినది నిజమే. అందుకు బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నా. చిన్మయి చెప్పిన ఒక సింగర్ తో తప్పుగా ప్రవర్తించాను. పాట రికార్డింగ్ టైమ్ లో ఉద్వేగానికి లోనై కౌగిలించుకున్న. ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశా. అయితే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో వెనక్కి తగ్గాను. అయితే అప్పుడే ఆమెకు క్షమాపణలు చెప్పాను. మరోసారి బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నా" అని రఘు వివరణ ఇచ్చారు. అదే విధంగా తన భార్యకు కూడా క్షమాపణలు చేబుతున్నానని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

1000 కోట్ల సినిమా ను ఒక ఫ్లాప్ మూవీ కోసం వదిలేసుకున్న నాగార్జున, కారణం ఏంటో తెలుసా?
Soundarya కి ఉన్న అరుదైన హ్యాబీ ఏంటో తెలుసా? ఖాళీ టైమ్‌లో ఆమె చేసి పని ఇదే