తన అనారోగ్యం పై వస్తొన్న వార్తలను ఖండించిన కోట

Published : Nov 10, 2017, 07:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
తన అనారోగ్యం పై వస్తొన్న వార్తలను ఖండించిన కోట

సారాంశం

తన ఆరోగ్యంపై మీడియా సమావేశం నిర్వహించిన కోట శ్రీనివాసరావు దశాబ్దాలుగా కేరక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న కోట ఇటీవల తన ఆరోగ్యంపై వస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించిన కోట

కొన్ని యుట్యూబ్ చానెల్స్  చేస్తున్న రాంగ్ పబ్లిసిటి వల్ల తన లాంటి ఆర్టిస్టులందరూ బాధ పడాల్సి వస్తొందన్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఏదో వయస్సు రీత్యా వచ్చే నొప్పులు తప్పితే నాకు ఇంకెలాంటి పెద్ద అనారోగ్యాలు లేవన్నారు.. ఈ మధ్య సుశీల గారి పై కూడా ఈ తరహా వార్తలు రావటం బాధాకరమన్నారు.

 

తన ఊపిరి తిత్తులు పనిచెయటం లేదంటూ ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తున్నారని, తనకు ఇప్పటికి సినిమాలు చెసె ఓపిక ఉందని కోట స్పష్టం చేశారు. నలభై ఏళ్ల బట్టి నన్ను సినిమా రంగం,  ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం  సినిమా పరిశ్రమ తీరు తెన్నులు ,వాతావరణం బాగా మారాయి. అందుకె  సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నాను. దయచేసి నా ఆరొగ్యం గురించి మళ్లీ మళ్లీ ఈ తరహా వార్తలు రాయొద్దు. ప్రభుత్వం కూడా ఇలాంటి రాంగ్  వార్తలను ప్రచారాలు చేసే యు ట్యూబ్ ఛానెల్స్ పై కఠిన వైఖరిని ప్రదర్శించాలని కొరారు కోట.

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు