చిరు, చరణ్ లతో కొరటాల పెద్ద ప్లానే వేశాడు!

Published : Dec 14, 2018, 12:16 PM IST
చిరు, చరణ్ లతో కొరటాల పెద్ద ప్లానే వేశాడు!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమా తరువాత ఏ దర్శకుడితో పని చేయనున్నాడనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. రైటర్, డైరెక్టర్ కొరటాల శివతో కలిసి పని చేయడానికే చిరంజీవి ఆసక్తి చూపుతున్నాడు. 

మెగాస్టార్ చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమా తరువాత ఏ దర్శకుడితో పని చేయనున్నాడనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. రైటర్, డైరెక్టర్ కొరటాల శివతో కలిసి పని చేయడానికే చిరంజీవి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశాడని తెలుస్తోంది.

త్వరలోనే ఫోటోషూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడానికి చిరంజీవి కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నాడు కొరటాల శివ. అయితే ఈ సినిమాలో ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ.

గతంలో రామ్ చరణ్ తో కలిసి కొరటాల ఓ సినిమా చేయాల్సివుంది కానీ సినిమా క్యాన్సిల్ అయింది. అప్పటినుండి వీరి కాంబోలో సినిమా రాలేదు. ఇప్పుడు తన కోరికను తీర్చుకోవడానికి కొరటాల శివ.. చిరుతో చేసే సినిమాలో రామ్ చరణ్ కోసం ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

PREV
click me!

Recommended Stories

వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Dec 16: అమూల్య ప్రేమ వేషాలు కళ్లారా చూసిన పెద్దోడు, నాన్నకి చెప్పేందుకు సిద్ధం