తొందరపడుతున్న కొరటాల..చిరుతో అయ్యేపనేనా?

Published : Jul 01, 2019, 09:24 AM IST
తొందరపడుతున్న కొరటాల..చిరుతో అయ్యేపనేనా?

సారాంశం

వరుస విజయాలతో ఉపుమీదున్న దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ కోసం చాలా ఓపికతో వెయిట్ చేస్తున్నాడు. భరత్ అనే నేను సినిమా అనంతరం వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయాలనుకున్న కొరటాలకు రామ్ చరణ్ అఫర్ నచ్చి మెగాస్టార్ తో చేయడానికి ఒప్పేసుకున్నాడు.   

అయితే అప్పటి నుంచి మెగాస్టార్ కోసం ఈ దర్శకుడు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడో అయిపోవాల్సిన సైరా షూటింగ్ మొన్న ఎండ్ అయ్యింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి. అవసరమైతే ప్యాచప్ సీన్స్ కోసం మరింత కష్టపడక తప్పదు. అయితే ఇలాంటి సమయంలో కొరటాల జులై సెకండ్ వీక్ లో మెగా ప్రాజెక్ట్ కి ముహూర్తం సెట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. 

రెగ్యులర్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట. కానీ సైరా పనులన్నీ అయిపోయేవరకు మెగాస్టార్ మరో ప్రాజెక్ట్ జోలికి వెళ్లకూడదని స్ట్రాంగ్ గా ఫిక్సయ్యాడట. అలాగే ఫిట్ నెస్ లో కూడా కొరటాల ప్రాజెక్ట్ కోసం కొన్ని మార్పులు చేయక తప్పదు. ఇలాంటి సమయంలో దర్శకుడు తీసుకున్న నిర్ణయానికి మెగా హీరోలు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి