తాప్సీతో.. ఆ హీరో 'నువ్వెవరు'!

Published : May 22, 2018, 03:37 PM IST
తాప్సీతో.. ఆ హీరో 'నువ్వెవరు'!

సారాంశం

ఆది పినిశెట్టి, తాప్సీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు హరి ఓ సినిమాను రూపొందిస్తున్నాడు

ఆది పినిశెట్టి, తాప్సీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు హరి ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. కోన వెంకట్ మరో నిర్మాతఎం.వి.వి.సత్యనారాయణతో కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో గురు ఫేం రితికా సింగ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో నిర్వహించారు. దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసేసారు.

ఇక సినిమాకు టైటిల్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. యంగ్ హీరో నానితో టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు. థ్రిల్లర్ నేపధ్యంలో సాగే ఈ సినిమాకు 'నువ్వెవరు' అనే టైటిల్ ఖాయం చేసినట్లు టాక్. నాని రివీల్ చేయబోయే టైటిల్ కూడా ఇదే అని సమాచారం.

కథ ప్రకారం సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అని భావించిన మేకర్ దీన్నే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి సినిమాను కూడా ఆసక్తికరంగా నడిపిస్తే ఆది పినిశెట్టి సోలోగా హిట్ అందుకోవడం ఖాయం. 

PREV
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది