‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’రిలీజ్ వివాదం, ఆపేదేలేదని కోన కౌంటర్

By Surya PrakashFirst Published Mar 26, 2024, 6:20 AM IST
Highlights

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రిలీజ్ ఆపాలి అంటూ ఎలక్షన్ కమిషన్ కి నట్టి కుమార్ లేఖ రాశారు. దీనిపై ఈ సినిమాకి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న కోన వెంకట్ ..


అంజలి టైటిల్‌ రోల్‌ పోషించిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్‌ గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అంజలి  50వ సినిమాగా తెరకెక్కుతుండగా.. శివతుర్లపాటి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయం ఇప్పుడు వివాదంలో పడింది. వివరాల్లోకి వెళితే...

అంజలి(Anjali) కీ రోల్ లో చేసిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’. 2014లో వచ్చిన ఈ చిత్రం  మంచి విజయం సాధించింది. మళ్ళీ పదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో సీక్వెల్ రాబోతుంది ఇప్పటికే టీజర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi)పై మంచి బజ్ క్రియేట్ అయ్యి సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం  ఏప్రిల్ 11న   రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాని వైసీపీ ఎంపీ, నిర్మాత MVV సత్యనారాయణ బ్యానర్ MVV సినిమా, కోన వెంకట్ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై నిర్మించటంతో విడుదల వివాదంగా మారింది.

రీసెంట్ గా టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఈ సినిమా రిలీజ్ ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వైసీపీ ఎంపీ సత్యనారాయణ నిర్మిస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రిలీజ్ ఆపాలి అంటూ ఎలక్షన్ కమిషన్ కి నట్టి కుమార్ లేఖ రాశారు. దీనిపై ఈ సినిమాకి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న కోన వెంకట్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. 

ఈ వీడియోలో కోన వెంకట్ మాట్లాడుతూ..  ' గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించాం. కానీ ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నట్టి కుమార్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాశారు. సినిమా విషయంలో ఆయనకు రూల్స్‌ తెలుసుకుని ఆ లేఖ రాసి ఉంటే బాగుండేది. ఎలక్షన్ కమిషన్, సెన్సార్ బోర్డు రూల్స్ తెలుసుకుని ఆ నిర్మాత లేఖ రాస్తే బాగుండేది. ఈ సినిమా ఎవరు ఆపినా ఆగేది కాదు. ఎలక్షన్స్‌కు సినిమాలకు దయచేసి ముడిపెట్టొద్దు. సినిమా అనేది ఒక పార్టీకి,కులానికి,మతానికి చెందినది కాదు. ఈ సినిమా కోసం కొన్ని వందలమంది కళాకారులు, టెక్నీషియన్లు పనిచేశారు. దయచేసి సినిమాను రాజకీయం చేయకండి. ఏప్రిల్‌ 11న ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుంది. సినిమాను ఆపేందుకు ఎవరు అడ్డుపడినా.. ఎంతమంది అడ్డుపడినా.. ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేసినా అనుకున్న రోజే సినిమా విడుదల అయి తీరుతుంది. అని ఆయన తెలిపారు.అని కౌంటర్ ఇచ్చారు. దీంతో కోన వెంకట్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా టాలీవుడ్ లో ఈ సినిమా ఇష్యూ చర్చగా మారింది. 

 హార్రర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, సత్య, షకలక శంకర్‌, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్‌, రాహుల్ మాధవ్ ఇతర నటీనటులు కీ రోల్స్‌ పోషిస్తున్నారు. ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్‌ తెరకెక్కిస్తున్నారు. మిమ్మల్ని ఊపిరాడకుండా చేసేలా సీక్వెల్‌ ఉండబోతోందని హామీ ఇస్తున్నాం. గీతాంజలి మళ్లీ వచ్చింది..  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 2024లో వస్తోంది అంటూ మేకర్స్‌ ఇప్పటికే అదిరిపోయే అప్‌డేట్ అందించారు.  

click me!