విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ మధ్య కెమిస్ట్రీ అదుర్స్.. సూపర్‌ కూల్‌గా `ఫ్యామిలీ స్టార్‌` థర్డ్ సాంగ్‌

By Aithagoni RajuFirst Published Mar 25, 2024, 11:25 PM IST
Highlights

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ జంటగా నటిస్తున్న `ఫ్యామిలీ స్టార్‌` మూవీ నుంచి మూడో పాట వచ్చింది. సూపర్‌ కూల్‌ మెలోడీ హంట్‌ చేస్తుంది. 
 

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా `ఫ్యామిలీ స్టార్‌` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ మూవీ నుంచి అప్‌డేట్లు ఇస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తుంది యూనిట్‌. తాజాగా హోలీ పండుగని పురస్కరించుకుని మూడో పాటని విడుదల చేసింది. `మధురము కదా` అంటూ సాగే పాటని సోమవారం విడుదల చేశారు. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ మధ్య వచ్చే కూల్‌ మెలోడీ సాంగ్‌ ఇది. వినడానికి ఎంతో కూల్‌గా ఉండటమే కాదు, చూడ్డానికి కూడా అంతే కూల్‌గా ఉంది. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

ప్రస్తుతం ఈ మూడో పాట శ్రోతలని అలరిస్తుంది. ఇందులో విజయ్‌, మృణాల్‌ జంట ఎంతో అందంగా ఉంది. జోడీ అదిరిపోయిందనేలా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. విజయ్‌ నుంచి మరో కూల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రాబోతుందని చెప్పొచ్చు. ఇక `మధురము కదా ` పాటకి శ్రీమణి లిరిక్స్ రాయగా, శ్రేయా ఘోషల్‌ అలపించారు. గోపీసుందర్‌ సంగీతం అందించారు. దిల్‌ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 5న సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ నెల 28న `ఫ్యామిలీ స్టార్‌` ట్రైలర్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. 

ఇక తాజాగా `ఫ్యామిలీ స్టార్‌` మూడో పాటని విడుదల చేసిన సందర్భంగా హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, `నేను చదువుకునే రోజుల్లో హోలీ పండుగ అంటే భయపడేవాడిని. రంగులు పూస్తారు, అవి అలాగే ఉండిపోతాయని ఇంట్లోనే ఉండిపోయేవాడిని. అదే టైమ్ లో ఎగ్జామ్స్ జరుగుతుంటే చాలా మంది మొహం నిండా రంగులతో వచ్చేవారు. కానీ ఇక్కడ మీ అందరితో కలిసి హోలీ జరుపుకుంటుంటే పండుగంటే ఇలా ఉండాలని అనిపిస్తోంది. మీ అందరి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినట్లు ఉన్నాయి. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ సినిమా చూసేందుకు థియేటర్స్ కు రండి. మన లాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక పర్సన్ కథ ఇది. ఫ్యామిలీ గురించి ఆలోచించే వారి కథ. థియేటర్స్ లో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు` అని తెలిపారు. 

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ,  `ఫ్యామిలీ స్టార్` అంటే  తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. ఈ కథ మొదట విజయ్ విన్నాడు. నాకు ఫోన్ చేసి పరశురామ్ మంచి స్టోరీ చెప్పాడు మీరు వింటారా అని అడిగాడు. నేను కథ విన్నాక 15 నిమిషాల్లో ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కథ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎమోషన్స్ అన్నీ విజయ్ క్యారెక్టర్ లో చూస్తారు. పాటలు, డైలాగ్స్, హీరోతో చెప్పించిన మానరిజమ్స్ అన్నీ రేపు థియేటర్స్ లో మిమ్మల్ని మీరు చూసుకున్నట్లు ఉంటుంది` అని చెప్పారు.

Read more:`వెంకీ2`పై క్రేజీ అప్‌డేట్‌.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన శ్రీనువైట్ల.. హీరో ఎవరు?

Also read: పెళ్లికి ముందే భార్యని వదిలించుకోవాలనుకున్న పూరీ జగన్నాథ్‌.. తెరవెనుక క్రేజీ స్టోరీ చెప్పిన స్టార్‌ డైరెక్టర్‌
 

click me!