కేటీఆర్ గురిపై కోనవెంకట్ కామెంట్!

Published : Dec 11, 2018, 10:50 AM IST
కేటీఆర్ గురిపై కోనవెంకట్ కామెంట్!

సారాంశం

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల జోరు మాములుగా లేదు. ప్రతి ఒక్కరూ ఈ ఎలెక్షన్స్ లో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ లో కొత్త ప్రొఫైల్ ఫోటో పెట్టారు.

తుపాకీ పట్టుకొని గురి చూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోకి ఇప్పటికే 16 వేల లైక్ లు, వెయ్యికి పైగా రీట్వీట్ లు వచ్చాయి. కేటీఆర్ గురి తప్పేలా లేదు.. విజయం ఆయనదే అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.

ఈ ఫోటోపై ప్రముఖ రచయిత కోన వెంకట్ కూడా తనదైన స్టైల్ లో కామెంట్ పెట్టాడు. ''ఈ ఒక్క ఫోటో చాలు బ్రదర్, ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. శుభాకాంక్షలు'' అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ ఫోటోపై దర్శకుడు హరీష్ శంకర్ కూడా కామెంట్ చేశాడు.

'ఈ ఫోటో కాన్ఫిడెన్స్ కి కొత్త అర్ధం చెబుతోంది. ఫలితాల నేపధ్యంలో కేటీఆర్ కొత్త ఫోటో పెట్టారు' అంటూ ట్వీట్ చేశారు. ఈరోజు ఉదయం మొదలైన ఎన్నికల కౌంటింగ్ లో ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. 

PREV
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?