త్రిషపై రజనీకాంత్ కామెంట్ వెరైటీగా ఉందే

Published : Dec 11, 2018, 10:29 AM IST
త్రిషపై  రజనీకాంత్ కామెంట్ వెరైటీగా ఉందే

సారాంశం

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం పేట్టాలో తలైవా సరసన సిమ్రాన్, త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే సిమ్రాన్, త్రిష, రజనీ లుక్ విడుదలైంది. 

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం పేట్టాలో తలైవా సరసన సిమ్రాన్, త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే సిమ్రాన్, త్రిష, రజనీ లుక్ విడుదలైంది. ఈ లుక్‌లో రజనీకాంత్ స్టైల్ లుక్, త్రిష చీరకట్టు బాగుందని కూడా టాక్ వచ్చింది. దాంతో టీమ్ చాలా ఉత్సాహంగా ఉంది. ఈ నేపధ్యంలో జరిగిన ఆడియో ఫంక్షన్ లో రజనీ చాలా చిత్రమైన కామెంట్స్ చేసారు. 

రజనీ మాట్లాడుతూ..తన ప్రక్కన త్రిష అనగానే ఒప్పుకుంటుందా..రిజెక్ట్ చేస్తుందా అని టెన్షన్ పడ్డానని అన్నారు. అసలు త్రిష తిరస్కరిస్తుందనే ఫిక్స్ అయ్యానని, కానీ చిత్రంగా త్రిష వచ్చి సినిమా చేసిందని అన్నారు. త్రిష పాత్ర చాలా చిన్నది కావటం,తనలాంటి పెద్ద వయస్సు ఉన్న హీరో ప్రక్కన అంటే ఏమనుకుంటుందో అనుకున్నామని అన్నారు. అయితే రజనీ ప్రక్కన నటించాలని హీరోయిన్స్ అంతా ఉవ్విళ్లూరుతూంటారు. అలాంటి ఆఫర్ వస్తే వదులుకుంటారా అంటున్నారు ఫ్యాన్స్.  ఇక సిమ్రన్ తో నటించటం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, రిఫ్రెష్ మెంట్ గా అనిపించిందని అన్నారు.

ఇక  ఈ చిత్రంలో రజినీకాంత్, త్రిషకు సంబంధించిన పోస్టర్‌చూస్తుంటే...త్రిష పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు సంబంధించినట్టు కనబడుతుంది. విలేజ్ అమ్మాయిగా త్రిష లుక్ బాగుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన లుక్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో చాలా యంగ్‌గా కనిపించే లుక్ విభిన్నంగా.. ఆకట్టుకునే విధంగా వుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధికీలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌