KGF స్టార్ యష్ కల నిజమయ్యేనా?

Published : Dec 11, 2018, 10:25 AM IST
KGF స్టార్ యష్ కల నిజమయ్యేనా?

సారాంశం

కేవలం ట్రైలర్ తోనే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను ఆకర్షిస్తున్నాడు కన్నడ యువ హీరో యాష్. విజువల్స్ చూస్తుంటే నేషనల్ స్థాయిలో సినిమా ఎదో సంచలనం సృష్టించేలా ఉందని సినీ ప్రముఖులు మద్దతు పలుకుతుండడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. 

కేవలం ట్రైలర్ తోనే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను ఆకర్షిస్తున్నాడు కన్నడ యువ హీరో యాష్. విజువల్స్ చూస్తుంటే నేషనల్ స్థాయిలో సినిమా ఎదో సంచలనం సృష్టించేలా ఉందని సినీ ప్రముఖులు మద్దతు పలుకుతుండడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. దర్శకదీరుడు రాజమౌళి కూడా ట్రైలర్ చూడగానే హీరోకి ఫిదా అయినట్లు చెప్పాడు. 

ఇక యాష్ ఈ సినిమాకు అన్ని భాషల్లో క్రేజ్ పెరుగుతుండడం చూసి తన వివరణ ఇచ్చాడు. భవిష్యత్తులో భాషాబేధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో ఇతర సినిమాలు మంచి ఆదరణతో రిలీజ్ అవుతాయని అందుకు సినీ ప్రముఖులు దోహదపడుతున్నట్లు ఈ సినిమాతో నిరూపితమవుతుందని అన్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని కోరుకున్నాడు. 

అయితే కన్నడలో తెలుగు సినిమాల డామినేషన్ ఎక్కువవుతోంది అంటూ అక్కడి సినీ ప్రముఖులు పలుసార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇప్పుడు యాష్ కి తెలుగు రాష్ట్రాల్లో మద్దతుగా నిలవడంతో యాష్ అన్నట్టుగా భాషాబేధం లేకుండా భారతదేశం మొత్తంలో అన్ని సినిమాలు సమానంగా రిలీజ్ అవ్వాలనే కల ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి