
ముందుస్తు సమాచారంతో పుంగనూరు పోలీసులు జూన్ 11న పట్టణ శివారులో తనిఖీలు ఏర్పాటు చేశారు. పోలీసులను చూసిన ఎర్ర చందనం స్మగ్లర్లు రెండు వాహనాల్లో పారిపోయే ప్రయత్నం చేశారు . పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కిషోర్ అనే వ్యక్తి రూ. 60 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డాడు. కిషోర్ జబర్దస్త్ హరి ముఠా సభ్యుడని తెలిసింది. హరి పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.
నిన్నటి నుండి జబర్దస్త్ కమెడియన్ హరి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో పరారీ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఫోటో హరికృష్ణది వేస్తున్నారు. అయితే స్మగ్లింగ్ కేసులో ఉంది హరి బాబు, నేను హరికృష్ణ అంటూ జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే కమెడియన్ స్పష్టత ఇచ్చాడు. మీడియా నా స్మగ్లింగ్ కేసులో నా ఫోటో వాడుతున్నారు. అది నేను కాదని వివరణ ఇచ్చారు.
హరికృష్ణ మాట్లాడుతూ... 2013లో షకలక శంకర్ టీమ్ లో హరిబాబు చేశాడు. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ మానేశాడు. హరిబాబుకు బదులుగా నా ఫోటో మీడియాలో వస్తుంది. హరి పేరుతో నేను పాప్యులర్ అయిన నేపథ్యంలో అందరూ నేనే అనుకుంటున్నారని ఆవేదన చెందారు.