బిగ్ బాస్ హౌజ్ లో ఇలా ముద్దులు పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు

Published : Aug 03, 2017, 04:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
బిగ్ బాస్ హౌజ్ లో ఇలా ముద్దులు పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు

సారాంశం

బిగ్ బాస్ హౌజ్ లో పెరిగిపోయిన గ్లామర్ డోస్ రాను రాను ఆసక్తికరంగా మారుతున్న బిగ్ బాస్ షో దీక్షా పంథ్ ను ముద్దుపెట్టుకున్న ప్రిన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న స్తార్ మా బిగ్ బాస్ షో రేటింగ్స్ టాప్ గేర్ లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. తెలుగు బుల్లితెరపై కనీ వినీ ఎరుగని రీతిలో వస్తున్న 'బిగ్ బాస్' రియాలిటీ షోకి భారీ స్పందనే వస్తోంది. మొదటి వారం పెద్దగా హంగామా లేకుండా సప్పగా సాగిన బిగ్ బాస్ కార్యక్రమం... రాను రాను రసవత్తరంగా మారుతోంది. ఇప్పటి వరకు ఏడుపులు పెడబొబ్బలు, చిరాకు పరాకులు, ఒకరిపై ఒకరు కంప్లైంట్లు, ఓదార్పులు ఇలా అదోరకంగా నడిచిన బిగ్ బాస్ లో మొదటి సారిగా రొమాన్స్ సీన్ తగలటంతో బిగ్ బాస్ హౌజ్ లోనే కాదు చూస్తున్న ప్రేక్షకులు కూడా థ్రిల్ లాంటి షాక్ కి గురయ్యారు.

తొలి వారంలోనే నటి జ్యోతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 14మందితో షో మొదలైయితే.. ఇద్దరు ఎలిమినేట్ కాగా, ఒకరు అర్థంతరంగా తప్పుకొన్నాడు. అర్థంతరంగా వెళ్లిపోయిన సంపూ స్థానంలో హీరోయిన్ దీక్షా పంత్... బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోని వారిని సర్‌ప్రైజ్‌ ఇస్తూ.. స్మిమ్మింగ్‌పూల్‌లోకి దిగి హాట్‌ హాట్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చిన తీరు కూడా అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక అప్పటి వరకు మంచి యంగ్ అమ్మాయిని పంపండి అంటూ గతంలో ప్రిన్స్ బిగ్ బాస్ కి మొరపెట్టుకున్న విషయం తెలిసిందే.

దీంతో దీక్ష ఎంట్రీ తో కాస్త బిగ్ బాస్ కి కలర్ వచ్చిందని అందరూ అన్నారు. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో లగ్జరీ బడ్జెట్ కోసం రసవత్తరంగా సాగుతున్న 'పైసా వసూల్' టాస్క్‌లో వసూలుదారులపై వినియోగదారులు గెలిపొందారు. దీంతో విన్నర్ గ్రూప్‌ సభ్యులుగా ఉన్న ధనరాజ్, ముమైత్ ఖాన్ లగేజ్‌ను తిరిగి ఇచ్చేశారు బిగ్ బాస్. లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ లో గెలుపొందిన వినియోగదారుల గ్రూపులోనే ఇద్దరూ ఉండటంతో ఆ అమౌంట్‌ని పంచుకునే నేపథ్యంలో దీక్షకు తక్కువ డబ్బులు కేటాయించడంతో ఎర్ర తోలు పిల్ల కాస్త బుంగమూతి పెట్టుకుంది. తాను ఎక్కువ పని చేయట్లేదనే విధంగా ప్రిన్స్ మాట్లాడటంతో దీక్ష దుఖఃంతో కంటతడి పెట్టుకుంది.

దాంతో అలిగిన దీక్షను బుజ్జగించే పనిలో దీక్షకు సారీ చెప్పి బుజ్జగించినా.. ప్రిన్స్ మాటలు వినకపోవడంతో... పక్క నుంచి మహేష్ పప్పి దేకే సారీ బోల్ అనడంతో... ప్రిన్స్ ఒక్కసారిగా.. దీక్షా పంథ్ ఎర్రని బుగ్గపై గాఢంగా ముద్దు పెట్టాడు. ఒక్కసారి అవాక్కైన దీక్ష.. కాసేపట్లోనే తేరుకుని చిరు నవ్వు తెచ్చుకోవడంతో కథ సుఖాంతమయింది. అయితే ఈ సీన్ చూసిన ప్రేక్షకులు మాత్రం ప్రిన్స్ అర్చనతో ప్రేమలో పడ్డాడేమో అనే అనుమానాలు పటాపంచలై ఇటువైపు దృష్టి పెట్టారు. ఇక పక్కన ఉన్న కార్తీక సహా తోటి హౌజ్ మేట్స్ అంతా ఒక్కసారిగా గొల్లున నవ్వేసారు.

దీంతో 'బిగ్ బాస్' షోలో అఫిషియల్ రొమాన్స్ ప్రారంభమైనట్లయ్యింది. ఇక బిగ్ బాస్ లో రొమాన్స్ పర్వం మొదలైంది. మరోవైపు అర్చన కూడా స్విమింగ్ పూల్ సీన్ లో కనిపించింది. ముందు ముందు ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో కానీ... ఇలా ముద్దులు పెట్టి  సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని తెలుగువాళ్లంతా అనుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే