ఇంటి అద్దె కట్టలేక ఇబ్బంది పడ్డా.. వాళ్ల ఫోన్లతో భయపడ్డా.. అడివి శేష్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Sep 17, 2018, 11:35 AM IST
Highlights

'క్షణం', 'గూఢచారి' వంటి సినిమాలతో రచయితగా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఒకప్పుడు ఇంటికి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డాడట. ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అడివి శేష్. 

'క్షణం', 'గూఢచారి' వంటి సినిమాలతో రచయితగా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఒకప్పుడు ఇంటికి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డాడట. ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అడివి శేష్. సినిమా రంగంలోకి రాకముందు అతడిది సాధారణమైన జీవితమని అనుకోవడానికి లేదు.

ఎందుకంటే అతడి తల్లితండ్రులు విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆయన తండ్రి డాక్టర్. తల్లితండ్రులతో ఉన్నంత కాలం ఆర్థికంగా అతడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదు. సినిమా రంగంలోకి వచ్చి ఆర్థికంగా కష్టాల్లో పడ్డాడట.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 'కర్మ' అనే సినిమా తన సొంత డబ్బులు పెట్టి తీశానని ఆ సినిమా ఆడకపోయినా.. పెద్దగా ఇబ్బంది పడలేదని, కొన్నేళ్ల తరువాత అప్పు చేసి మరీ తీసిన 'కిస్' సినిమా మాత్రం తనను నిండా ముంచేసిందని శేష్ స్పష్టం చేశాడు. ''కిస్ సినిమా మొదటి షో అవగానే ఆ సినిమా పోస్టర్లు అంటించడానికి ఖర్చయిన డబ్బు కూడా రాదని తేలిపోయింది.

నా జీవితంలో నేను ఎక్కువగా బాధ పడింది ఆ రోజే. ఆ తరువాతి నెల అద్దె కట్టడం కూడా కష్టం అయిపొయింది. అప్పులోళ్ల ఫోన్లతో జీవితం ఏమవుతుందోనని భయపడ్డాను. అలంటి సమయంలో 'బాహుబలి' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ చిత్రబృందం ఇచ్చిన ప్రోత్సాహంతో నటుడిగా నిలదొక్కుకొని.. ఆ తరువాత నాకంటూ మంచి పేరు సంపాదించుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు.  

click me!