
మహానటి సావిత్రి జీవితకథను సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి క్లాస్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు, నిర్మాత అశ్వనీదత్‌కు అల్లుడైన అశ్విన్ చాలారోజుల క్రితమే మహానటి సావిత్రిపై సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. మహానటి సావిత్రి బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై చాలా కాలం అవుతున్నా.. ఇంతవరకు పట్టాలెక్కలేదు. ముఖ్యంగా మహానటి సావిత్రి పాత్ర కోసం నటిని ఎంపిక చేయడమే యూనిట్ సభ్యులకు కష్టమవుతోంది.
ఇప్పటికే మహానటి పాత్రలో నటిస్తున్నట్టుగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, మలయాళీ భామ నిత్యామీనన్‑తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఈ లిస్ట్‑లో మరో పేరు వినిపిస్తోంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కీర్తీ సురేష్‑ను ఈ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ కీర్తీ పేరునైన యూనిట్ సభ్యులు ప్రకటిస్తారో లేక మరోసారి రూమర్స్ అంటూ కొట్టిపారేస్తారో చూడాలి.