కిరాక్ పార్టీ 3 రోజల వసూళ్లు

Published : Mar 20, 2018, 05:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
కిరాక్ పార్టీ 3 రోజల వసూళ్లు

సారాంశం

నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'కిరాక్ పార్టీ' విడుదలైన ప్రతిచోటా భారీ వసూళ్లు  ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన నిఖిల్ 

నిఖిల్ కథానాయకుడిగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'కిరాక్ పార్టీ' సినిమా తెరకెక్కింది. సిమ్రాన్ పరింజా .. సంయుక్తా హెగ్డే కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నిఖిల్ కెరియర్లోనే భారీ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది.

మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 15 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, మొదటి మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ సినిమా లాభాల బాట పట్టడానికి ఎన్నో రోజులు పట్టదనే విషయం స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. ప్రేక్షకుల ఆదరణ వల్లనే ఈ స్థాయి సక్సెస్ సాద్యమైందంటూ .. ఆదివారం రాత్రి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన నిఖిల్, ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.  

 

PREV
click me!

Recommended Stories

Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ