'మెగా హీరోతో లవ్' పై స్పందించిన రాశి ఖన్నా

Published : Mar 20, 2018, 05:24 PM ISTUpdated : Mar 25, 2018, 05:26 PM IST
'మెగా హీరోతో లవ్' పై స్పందించిన  రాశి ఖన్నా

సారాంశం

రకుల్ .. లావణ్య త్రిపాఠి నాకు మంచి ఫ్రెండ్స్  హీరోల్లో చాలామంది ఫ్రెండ్స్ వున్నారు  లవ్ లో పడ్డాననేది పుకారు మాత్రమే  

కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కథానాయికల జాబితాలో రాశి ఖన్నా కనిపిస్తుంది. సాధారణంగా ఒక హీరోయిన్ కి ఇతర హీరోయిన్లతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది. రాశి ఖన్నాకి మాత్రం హీరోలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుందనే టాక్ వుంది. అదే విషయాన్ని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆలీ ప్రస్తావించగా, రాశి ఖన్నా తనదైన శైలిలో స్పందించింది. తాను రకుల్ .. లావణ్య త్రిపాఠిలతో ఎక్కువ స్నేహంగా ఉంటానని చెప్పింది.

ఇక హీరోలతో ఫ్రెండ్షిప్ ఎక్కువనే మాట కూడా నిజమేనని అంది. అయితే వాళ్లందరితో పాటు నన్నెందుకు బర్త్ డే పార్టీకి పిలవలేదంటూ ఆలీ ఆటపట్టించాడు. 'ఒక మెగా హీరోతో లవ్ లో పడ్డావనే టాక్ కూడా ఇండస్ట్రీలో వుంది' అని ఆలీ అనడంతో, 'అయితే ఆ మెగా హీరో ఎవరో చెప్పండి' అంటూ రాశి ఖన్నా నవ్వేసింది. అదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?