కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్, సంబరాలు చేసుకుంటున్న యంగ్ హీరో

Published : May 23, 2025, 11:49 AM IST
Kiran Abbavaram Welcomes Baby Boy

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. ఇంటికి వారసుడు వచ్చిన సంతోషంలో పండగ చేసుకుంటున్నాడు యంగ్ హీరో. తన సంతోషాన్ని ఫ్యాన్స్ కు తెలిసేలా ఎమోషనల్ పోస్ట్ ను కూడా శేర్ చేశాడు కిరణ్ అబ్బవరం.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. ఆయన భార్య రహస్య, గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను స్వయంగా కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించారు. తన కొడుకు పుట్టిన ఆనందం అందరికి అర్ధం అయ్యేలా ఓ ఎమోషనల్ ఫోటోను షేర్ చేశారు. అందులో తన కొడుకు సున్నితమైన పాదానికి ముద్దుపెడుతు కనిపించారు కిరణ్.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు కిరణ్ , రహస్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని స్పందిస్తూ.. “మీ ఇంటికి జూనియర్ అబ్బవరం వచ్చారు” అంటూ కామెంట్ చేయడం హైలైట్‌గా నిలిచింది.

కిరణ్ అబ్బవరం 1992 జూలై 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రాయచోటిలో జన్మించారు. 2019లో విడుదలైన “రాజావారు రాణిగారు” సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అదే సినిమాలో నటించిన రహస్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్ల ప్రేమను కొనసాగించిన ఈ జంట, 2024 ఆగస్టు 22న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఇప్పుడు ఈ దంపతులకు మగబిడ్డ పుట్టడం వారి కుటుంబానికి కొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది. బాబు పుట్టిన విషయాన్ని ఎంతో సంతోషంగా అభిమానులతో శేర్ చేసుకున్నారు కిరణ్, తన కొత్త జీవితానికి తొలి అడుగులు వేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ శుభవార్తపై ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కిరణ్ కు  శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?
Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 10 ఎపిసోడ్ : డబ్బులు ఇస్తూ బుద్ధి బయటపెట్టిన మనోజ్, వద్దని షాకిచ్చిన బాలు..!