మళ్ళీ వణుకు పుట్టిస్తున్న కరోనా.. రీసెంట్ గా సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ కి కోవిడ్ పాజిటివ్

Published : May 23, 2025, 10:16 AM IST
Nikita Dutta

సారాంశం

బాలీవుడ్ సెలబ్రెటీలకు కోవిడ్ తాకిడి మొదలయింది. శిల్పా శిరోద్కర్ తర్వాత మరో హీరోయిన్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

మరోసారి కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. క్రమంగా ఇండియాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆసియా దేశాల్లో కోవిడ్ ఎక్కువగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబయి, చెన్నై, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

శిల్పా శిరోద్కర్ కి పాజిటివ్

రెండు రోజుల క్రితం బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శిల్పా శిరోద్కర్.. మహేష్ బాబు సతీమణి నమ్రతకి సోదరి అనే సంగతి తెలిసిందే. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రజలంతా మాస్కులు ధరించి సేఫ్ గా ఉండండి అంటూ శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియాలో ప్రకటించారు.

జ్యువెల్ థీఫ్ హీరోయిన్ కి కూడా..

శిల్పా శిరోద్కర్ తర్వాత మరో బాలీవుడ్ నటి కోవిడ్ బారిన పడ్డారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నిఖిత దత్త. తనకు కోవిడ్ సోకిన విషయాన్ని నిఖిత సోషల్ మీడియాలో ప్రకటించారు. కోవిడ్ వచ్చి నన్ను నా తల్లిని పలకరించింది. అనుకోకుండా వచ్చిన ఈ గెస్ట్ ఎక్కువ కాలం ఉండదని అనుకుంటున్నా. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటున్నా. అందరూ సేఫ్ గా ఉండండి అంటూ నిఖిత పోస్ట్ చేసింది.

నిఖిత దత్త చివరగా సైఫ్ అలీ ఖాన్ సరసన జ్యువెల్ థీఫ్ అనే చిత్రంలో నటించారు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. డైమండ్ రాబరీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అత్యధిక వ్యూస్ తో నెట్ ఫ్లెక్స్ లో దూసుకుపోతోంది.

ఇటీవల ఇండియాలో 200 పైగా కోవిడ్ కేసులో నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు ప్రారంభించాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు