30 ఏళ్ల తరువాత , కాన్స్ లో చరిత్ర సృష్టించిన ఇండియన్ సినిమా

Published : May 23, 2025, 10:26 AM ISTUpdated : May 23, 2025, 11:15 AM IST
30 ఏళ్ల తరువాత , కాన్స్ లో చరిత్ర సృష్టించిన ఇండియన్ సినిమా

సారాంశం

దాదాపు 30 ఏళ్ల తరువాత కాన్స్ లో ఇండియన్ సినిమా చరిత్ర సృష్టించింది. ఈ గౌరవంతో ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాకు మరింత గుర్తింపు దక్కబోతోంది. కాన్స్ లో ఇండియా సాధించిన ఘనత ఏంటి?

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 భారతీయ సినిమా చరిత్రలో అద్భుతంగా నిలిచింది. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన “All We Imagine As Light” చిత్రానికి ప్రెస్టీజియస్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు లభించడంతో భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించింది. 1994లో షాజి ఎన్ కరుణ్ దర్శకత్వం వహించిన “Swaham” సినిమా తరువాత మన సినిమా ఇటువంటి గౌరవం అందుకోవడం ఇదే మొదటిసారి.

అంతే కాదు ఇండియా నుంచి పాయల్ కపాడియా జ్యూరీ సభ్యురాలిగా కూడా ఈ ఏడాది నియమితులవడం గర్వకారణం. ఆమె మాట్లాడుతూ  భారతీయ సినిమాను మరోసారి 30 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేయవద్దు అని వేడుకున్నారు. కాన్స్ 2024లో మరో అద్భుతం కూడా జరిగింది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన “Homebound” సినిమా ‘Un Certain Regard’ విభాగంలో  స్క్రీనింగ్ అయ్యింది. అలాగే సత్యజిత్ రే రూపొందించిన “అరణ్యేరు దిన్ రాత్రి” సినిమాను వెస్ ఆండర్సన్ 4K రీస్టోరేషన్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేశారు. SRFTI నుండి వచ్చిన “A Doll Made Up of Clay” షార్ట్ ఫిల్మ్ ‘La Cinef’ విభాగంలో పోటీ పడింది.

ఇదే కాకుండా, సోను రణదీప్ చౌధురీ  రాజస్థానీ చిత్రం “Omlo” కాన్స్ మార్కెట్‌లో అమ్ముడై, లండన్‌లోని 26వ రైన్బో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ కానుంది. అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన “Tanvi the Great” , సుదిప్తో సేన్  “Charak” సినిమాలు కూడా స్క్రీనింగ్ అయ్యాయి..

భారతీయ సినిమా తొలిసారి 1946లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రవేశించింది. చెతన్ ఆనంద్ రూపొందించిన “Neecha Nagar” ప్రైజ్ పొందిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఆ తరువాత బిమల్ రాయ్ రూపొందించిన, “Do Bigha Zamin”, సత్యజిత్ రే  “Pather Panchali”, మృణాళ్ సేన్, మురళీ నాయర్, మిరా నాయర్ వంటి దర్శకులు భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చారు.

ఇక నిర్లక్ష్యానికి గురైన భారతీయ క్లాసిక్ సినిమాలను పునరుద్ధరించేందుకు NFDC, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ వంటి సంస్థలు విశేషంగా కృషి చేశాయి. ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కార్సెసి కూడా భారతీయ సినిమా రీస్టోరేషన్‌కు తన మద్దతు తెలిపాడు. కాన్స్ క్లాసిక్స్ విభాగంలో “చారులత, తంపు”, ఇషణౌ”, “మన్థన్” వంటి గొప్ప సినిమాలు స్క్రీనింగ్ అయ్యాయి.

ఈ క్రమంలో నూతన దర్శకులు కూడా మెరుగైన విజయాలు సాధిస్తున్నారు. FTII విద్యార్థి చిదానంద ఎస్ నాయక్ “Sunflowers Were the First Ones to Know” షార్ట్ ఫిల్మ్ ద్వారా “La Cinef” అవార్డు గెలిచారు. అదే విభాగంలో మాన్సి మహేశ్వరి “Bunnyhood” చిత్రానికి మూడవ బహుమతి అందుకున్నారు. అనసూయ సంగుప్తా “Shameless” సినిమాలో “రేణుక” పాత్రకు “Un Certain Regard” విభాగంలో ఉత్తమ నటి అవార్డు గెలిచారు, ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటిగా నిలిచారు.Cannes 2024లో చూపిన ప్రతిభ భారతీయ సినిమా కథనాలను అంతర్జాతీయంగా మరో స్థాయికి తీసుకెళ్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు