హ్యాట్రిక్ హిట్ మిస్ అయ్యింది.. ఈసారి హిట్ పక్కా అంటున్న కిరణ్ అబ్బవరం, కొత్త సినిమా స్టార్ట్

Published : Mar 15, 2022, 09:43 AM IST
హ్యాట్రిక్ హిట్ మిస్ అయ్యింది.. ఈసారి హిట్ పక్కా అంటున్న కిరణ్ అబ్బవరం, కొత్త సినిమా స్టార్ట్

సారాంశం

ఈసారి హిట్టు పక్కా అంటున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా హ్యట్రిక్ హిట్ మిస్ అయిన యంగ్ హీరో.. ఈసారి మరో సరికొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 

రాజా వారు రాణి వారు, ఎస్ ఆర్ కల్యాణ పండపం లాంటి సినిమాలతో యూత్ ను బాగా అట్రాక్ట్ చేశాడు కిరణ్ అబ్బవరం. డిఫరెంట్ యాటిట్యూడ్ తో హీరో మెటీరియల్ అనిపించకున్న కిరణ్.. సెబాస్టియన్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలి అనుకున్నాడు. కాని అనూహ్యంగా సెబాస్టియర్ మూవీ ప్లాప్ తో హ్యాట్రిక్ హిట్ మిస్ అయ్యాడు కిరణ్. థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ డే నుంచి ధారుణంగా పడిపోయింది. 

సెబాస్టియన్ ప్లాన్ తో కుంగిపోకుండా నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టాడు యంగ్ హీరో.. మొదటి నుంచీ తాను చేస్తున్న సినిమాల మాదిరిగానే డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలక్ట్ చేసుకుంటూ.. సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈసారి పక్కాగా హిట్ కొట్టాలి అనే కసితో ఉన్నాడు కిరణ్. అందుకే రీసెంట్ గా కొత్త సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఈసారి వినరో భాగ్యము అంటూ రాబోతున్నాడు.  

కిరణ్‌ అబ్బవరం, కశ్మీరా పర్దేశి జంటగా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ప్రశాంత్‌ నీల్, కిశోర్‌ తిరుమల లాంటి స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న మురళి కిషోర్‌ అబ్బురు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్‌ సోమవారం తిరుపతిలో స్టార్ట్ అయ్యింది. 

 

వినరో భాగ్యము విష్ను కథ మూవీ డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కబోతోంది. సినిమా షూటింగ్ కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు టీమ్. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో దాదాపు 80శాతం షూటింగ్‌ పూర్తి చేసేలా టీమ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు చేతన్‌ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో ఈసారి సాలిడ్ హిట్ కొడతామన్న నమ్మకంతో ఉన్నారు కిరణ్ అబ్బవరం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?