
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా “వకీల్ సాబ్”. ‘వకీల్ సాబ్’థియోటర్స్ లోనే కాదు... టీవీల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం గత ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యి కేవలం 14 రోజులు మాత్రమే థియేటర్స్ లో ఉంది. ఆ తర్వాత ప్రైమ్ వీడియోలో కూడా వెంటనే వచ్చేసిన ఈ చిత్రం గత వారం జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా భారీ ప్రమోషన్స్ తో టెలికాస్ట్ అయ్యి రికార్డ్ లు బద్దలు కొట్టింది. ఆ రోజు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉన్నా కూడా ఈ చిత్రం ఫస్ట్ టైం టెలికాస్ట్ కి గాను 19.12 సాలిడ్ రేటింగ్ ను రాబట్టడం అంటే మాటలు కాదు. పవన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ మరియు బెస్ట్ గా వచ్చింది అని చెప్పాలి. జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కాగా ఈ సినిమాకు 19.1 టీఆర్పి రేటింగ్ వచ్చింది.
థియేటర్లలో కరోనా సెకండ్ వేవ్ వల్ల వకీల్ సాబ్ ను చూడలేని ప్రేక్షకులు టీవీలలో సినిమాను చూసారు. కలెక్షన్ల పరంగా, రికార్డుల పరంగా కూడా సెన్సేషన్‌ని నమోదు చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఓ అవార్డుని గెలుచుకుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్ కి ఇండియన్ మార్కెటింగ్ అవార్డ్స్‌లో జీ తెలుగు ఉత్తమ అనుభవపూర్వక మార్కెటింగ్ కేటగిరిలో బ్రోన్జ్ అవార్డ్‌ని గెలుచుకుంది.
వకీల్ సాబ్ హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డైలాగ్స్: తిరు, యాక్షన్ రవివర్మ, వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, సమర్పణ: బోనీ కపూర్, నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్ , దర్శకత్వం: శ్రీరామ్ వేణు.