యంగ్ హీరో కిరణ్ అబ్బవరం - నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. తాజాగా రొమాంటిక్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి ప్రస్తుతం రెండు చిత్రాలతో అలరించేందుకు సిద్ధగా ఉంది. చివరిగా ‘డిజేటిల్లు’తో అదరగొట్టింది. ప్రస్తుతం కార్తీకేయ సరసన ‘బెదురులంక’, కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’లో నటిస్తోంది. ఇటీవల Rules Ranjan నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. ఈ సారి గట్టిగా హిట్ కొట్టేందుకు అటు కిరణ్, ఇటు నేహా రెడీ అవుతున్నారు. `డీజే టిల్లు` తర్వాత నేహా శెట్టితో కలిసి కిరణ్ `రూల్స్ రంజన్` చిత్రంలో నటిస్తున్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
యంగ్ సెన్సేషన్‌గా మారిన కిరణ్, నేహా శెట్టి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో `రూల్స్ రంజన్`పై ప్రారంభం నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి వరుసగా అప్డేట్స్ అందిస్తున్నారు. గతంలో విడుదలైన పోస్టర్లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టైటిల్ కూడా క్రేజీగా ఉంది. ఇక రీసెంట్ గా వచ్చిన `నాలో నేనే లేను` అనే పాటకూ మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలో మరోసాంగ్ ను విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధంగా ఉంది. తాజాగా సాంగ్ ప్రొమోను రిలీజ్ చేశారు.
‘సమ్మోహనుడా’ (Sammohanuda) టైటిల్ తో సాంగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సాంగ్ లో నేహా శెట్టి అందాల ప్రదర్శనతో అదరగొట్టింది. కిరణ్, నేహా కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. పైగా రెయిన్ డాన్స్ తో దుమ్ములేపారని అర్థం అవుతోంది. స్టార్ సింగర్ శ్రేయా గోషల్ అద్భుతంగా పాడింది. అందుకు తగట్టుగా కిరణ్, నేహా ఆడారని ప్రోమో ద్వారా అర్థం అవుతోంది. ఫుల్ సాంగ్ జూలై 20న విడుదల కానుంది. అమ్రిశ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మంచి మ్యూజిక్ తో ఆకట్టుకుంటున్నారు. చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ నటిస్తున్నారు.