నాపై అలాంటి కామెంట్స్ బాధపెట్టాయి..ఆ విషయంలో నాన్న చాలా కఠినం, సుస్మిత కొణిదెల కామెంట్స్

Published : Jul 17, 2023, 06:45 AM IST
నాపై అలాంటి కామెంట్స్ బాధపెట్టాయి..ఆ విషయంలో నాన్న చాలా కఠినం, సుస్మిత కొణిదెల కామెంట్స్

సారాంశం

మెగా డాటర్ సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థలం, సైరా లాంటి చిత్రాలకు సుస్మితా కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. త్వరలో తన తండ్రి చిరంజీవితో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతోంది.

మెగా డాటర్ సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థలం, సైరా లాంటి చిత్రాలకు సుస్మితా కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. త్వరలో తన తండ్రి చిరంజీవితో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఇండస్ట్రీలో కొనసాగడం అంత సులభం కాదంటూ తాజాగా ఇంటర్వ్యూలో సుస్మితా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఏది అంత ఈజీగా ఉండదు. ప్రతిరోజు పోరాటం చేయాలి. వర్క్ ని ఎంజాయ్ చేయగలిగేవారు మాత్రమే ఇండస్ట్రీలో ఉండగలరు అంటూ సుస్మితా కొణిదెల అన్నారు. అయితే బిగినింగ్ లో తనపై వచ్చిన కామెంట్స్ చాలా బాధపెట్టాయని సుస్మిత అన్నారు. 

చాలా మంది నేపోటిజం అంటూ కామెంట్స్ చేశారు. ఇంకా చాలా రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు క్రియేట్ చేశారు. ఆ కామెంట్స్ పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం.. ముందుకు వెళ్లడం కుదరదు. అందుకే అలాంటి కామెంట్స్ ని పట్టించుకోవడం మానేశానని సుస్మితా అన్నారు. 

తన తండ్రి చిరంజీవి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆయన మా నాన్న అయినప్పటికీ సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలో చాలా కఠినంగా ఉంటారు. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా అంతే. నేను కూతుర్ని కాబట్టి సాఫ్ట్ గా ఉండడం లాంటిది ఏమీ ఉండదు. సైరా నుంచి నాన్న చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నా. నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తారు అంటూ సుస్మిత పేర్కొంది. 

ఇటీవల సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లోనే చిరంజీవితో ఆమె చిత్రం నిర్మించబోతోంది. 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు