కింగ్‌ నాగ్‌ పాత్‌ బ్రేక్‌.. వారికి దారి చూపాడట

Published : Sep 03, 2020, 05:18 PM ISTUpdated : Sep 03, 2020, 05:22 PM IST
కింగ్‌ నాగ్‌ పాత్‌ బ్రేక్‌.. వారికి దారి చూపాడట

సారాంశం

దాదాపు ఆరు నెలలుగా కరోనా వల్ల సినిమా చిత్రీకరణలు ఆగిపోయిన నేపథ్యంలో ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతులిచ్చింది. కరోనా జాగ్రత్తలతో సినిమా చిత్రీకరణలు జరుపుకోవచ్చని పేర్కొంది. దీంతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల్లో నాగ్‌ ముందుగా బరిలోకి దిగారు.

నాగార్జున షూటింగ్‌ మొదలు పెట్టాడు. దాదాపు ఆరు నెలలుగా కరోనా వల్ల సినిమా చిత్రీకరణలు ఆగిపోయిన నేపథ్యంలో ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతులిచ్చింది. కరోనా జాగ్రత్తలతో సినిమా చిత్రీకరణలు జరుపుకోవచ్చని పేర్కొంది. దీంతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల్లో నాగ్‌ ముందుగా బరిలోకి దిగారు. షూటింగ్‌లు రీస్టార్ట్ చేశారు. 

ఆయన ఇప్పటికే `బిగ్‌బాస్‌ 4` షూటింగ్‌ని ప్రారంభించి, మిగతా సీనియర్‌ హీరోలకు, యంగ్‌ స్టర్స్ కి ఆదర్శంగా నిలిచారు. తాజాగా గురువారం తాను నటిస్తున్న `వైల్డ్ డాగ్‌` షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌ ఓ స్పెషల్‌ వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. అందులో నాగ్‌ లోకేషన్‌కి రావడం, శానిటైజింగ్‌ చేసుకోవడం, చాలా జాగ్రత్తలతో మేకప్‌ వేసుకోవడం, సెట్‌లో చాలా పరిమితంగా క్రూ ఉండటం, ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడం వంటివి కనిపిస్తున్నాయి. 

ఈ సందర్భంగా నాగ్‌ చెబుతూ, ఇది `వైల్డ్ డాగ్‌` కోసం ఓ సరదా షూటింగ్‌. అలాగే ఒక్క రోజు తర్వాత బిగ్‌ బాస్‌ 4 షూటింగ్‌ చేయనున్నాం. లైట్‌.. కెమెరా.. యాక్షన్‌.. అన్ని రకాల జాగ్రత్తలతో వైల్డ్ డాగ్‌ షూటింగ్‌ ప్రారంభమైంది` అని తెలిపారు. ఇందులో యూట్యూబ్‌ లింక్‌ని షేర్‌ చేశారు. ఇందులో కింగ్‌ పాత్‌ బ్రేక్‌ చేసి మిగతా వారికి దారిచూపారని పేర్కొనడం విశేషం. సాల్మోన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `వైల్డ్ డాగ్‌`లో నాగ్‌ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన లుక్‌ ఆకట్టుకుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?