కంగనా మరో సెన్సేషనల్‌ కామెంట్‌.. ముంబయి షేక్‌

Published : Sep 03, 2020, 04:48 PM IST
కంగనా మరో సెన్సేషనల్‌ కామెంట్‌.. ముంబయి షేక్‌

సారాంశం

కంగనా రనౌత్‌.. రోజుకో సంచలన వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్‌లో సెన్సేషన్‌ అవుతుంది. తాజాగా ఈ రెబల్‌ బ్యూటీ మరో బోల్డ్ కామెంట్‌ చేసింది. తనని శివసేన ఎంపి సంజయ్‌ రౌత్‌ బెదిరించాడని ఆరోపించింది. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌.. రోజుకో సంచలన వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్‌లో సెన్సేషన్‌ అవుతుంది. తాజాగా ఈ రెబల్‌ బ్యూటీ మరో బోల్డ్ కామెంట్‌ చేసింది. తనని శివసేన ఎంపి సంజయ్‌ రౌత్‌ బెదిరించాడని ఆరోపించింది. అంతేకాదు ముంబయి ఇప్పుడు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లాగా కనిపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఈ మేరకు కంగనా ట్వీట్‌ చేసింది. ఇటీవల బాలీవుడ్‌ స్టార్స్ డ్రగ్‌ టెస్ట్ చేసుకోవాలని డిమాండ్‌ చేసింది. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుకి బాలీవుడ్‌లో డ్రగ్‌ మాఫియాకి సంబంధం ఉందనే వార్తలు వినిపించిన విషయం నేపథ్యంలో కంగనా ఇలాంటి కామెంట్‌ చేసింది. 

తాజాగా ట్విట్టర్‌ ద్వారా ఆమె స్పందిస్తూ, శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ నుంచి నాకు బహిరంగ ముప్పు ఉంది. నన్ను ముంబయికి తిరిగి రాకూడదని బెదిరించాడు. దీంతో ముంబయి ఇప్పుడు పాక్‌ ఆక్రమించిన కాశ్మీర్‌ వలే కనిపిస్తుంది` అని పేర్కొంది. దీనిపై సంజయ్ స్పందిస్తూ, ఆమె ద్రోహానికి పాల్పడుతుంది. ముంబయికి రాకూడదని తాము అభ్యర్థిస్తున్నాం. ఇది ముంబయి పోలీసులను అవమానపరచడం తప్ప మరొకటి కాదు. దీనిపై హోంమంత్రిత్వశాఖ చర్యలు తీసుకోవాలి` అని తెలిపారు. 

మొత్తానికి బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బాలీవుడ్‌లోనే కాదు ముంబయి మొత్తం హాట్‌ టాపిక్‌గా మారింది. మరి కంగనా వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌