మాస్‌ మహరాజా క్రాక్‌ థియేటర్‌లోనే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

Published : Sep 03, 2020, 04:00 PM ISTUpdated : Sep 03, 2020, 06:06 PM IST
మాస్‌ మహరాజా క్రాక్‌ థియేటర్‌లోనే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

సారాంశం

తాజాగా ఈ సినిమాలోని రవితేజ లుక్‌ని విడుదల చేశారు. పోలీస్‌ డ్రెస్‌లో మీసం మెలేస్తూ, కూల్‌డ్రింగ్‌ తాగుతున్నట్టుగా ఉన్న రవితేజ లుక్‌ మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. 

రవితేజ ప్రస్తుతం `క్రాక్‌` చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌, యాక్షన్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రమిది. రవితేజకు జోడీగా శృతి హాసన్‌ నటిస్తుండగా, ఇందులో మాస్‌ మహారాజా పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, లుక్‌లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసింది. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని రవితేజ లుక్‌ని విడుదల చేశారు. పోలీస్‌ డ్రెస్‌లో మీసం మెలేస్తూ, కూల్‌డ్రింగ్‌ తాగుతున్నట్టుగా ఉన్న రవితేజ లుక్‌ మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. విడుదల కావడమే ఆలస్యం.

ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ అయ్యేలా లేవు. దీంతో చిత్ర బృందం దీన్ని ఓటీటీలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. తాజా లుక్‌ విడుదల వెనకాల అసలు కారణమిదే అనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి. ఈ వార్తలపై చిత్ర దర్శకుడు గోపిచంద్‌ మలినేని క్లారిటీ ఇచ్చాడు. క్రాక్‌ సినిమా ఖచ్చితంగా థియేటర్‌లోనే రిలీజ్‌ అవుతుందని ట్వీట్ చేశాడు. ఈ సినిమాను సరస్వతి ఫిల్మ్ డివిజన్‌ పతాకంపై ఠాగూర్‌ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌