గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ మూవీ... కిల్లింగ్ మెషిన్ గా నాగ్, ప్రీ లుక్ అదుర్స్

By team teluguFirst Published Aug 27, 2021, 9:57 AM IST
Highlights

గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారుతో నాగార్జున మూవీ చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. నేడు దీనిపై అధికారిక ప్రకటనతో పాటు ప్రీ లుక్ విడుదల చేశారు. చేతిలో రక్తంతో తడిసిన కత్తితో నాగార్జున కిల్లింగ్ మెషిన్ లా ఉండగా, ప్రీ లుక్ మూవీపై ఆసక్తి రేపుతోంది. 

టాలీవుడ్ సీనియర్ స్టార్స్ వరుసగా చిత్రాలు ప్రకటిస్తూ.. కుర్ర హీరోలు మాతో సరిపోలరని నిరూపిస్తున్నారు. ఆచార్య మూవీ చేస్తున్న చిరంజీవి బర్త్ డే కానుకగా మూడు చిత్రాలు ప్రకటించారు. లూసిఫర్, వేదాళం రీమేక్స్ తో పాటు, దర్శకుడు బాబీతో మరో చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. మరో సీనియర్ హీరో నాగార్జున కూడా జోరు పెంచారు. రెండు రోజుల వ్యవధిలో ఆయన రెండు కొత్త చిత్రాలు ప్రకటించారు. 

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారు. నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్న బంగార్రాజు మూవీ షూటింగ్ నిన్న ప్రారంభమైంది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కుతున్నట్లు సమాచారం. కాగా నేడు దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో నాగ్ మూవీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 


గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారుతో నాగార్జున మూవీ చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. నేడు దీనిపై అధికారిక ప్రకటనతో పాటు ప్రీ లుక్ విడుదల చేశారు. చేతిలో రక్తంతో తడిసిన కత్తితో నాగార్జున కిల్లింగ్ మెషిన్ లా ఉండగా, ప్రీ లుక్ మూవీపై ఆసక్తి రేపుతోంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కే అవకాశం కలదు. 29న ఈ చిత్రం నుండి మరో అప్డేట్ రానుంది. నారాయణ్ కె నారంగ్ నిర్మాతగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

Here's the PRE LOOK of
🗡️ 🗡️

⭐ing KING 👑
A film by 💥

An exciting update coming your way on 29-08-21 🔐🔥 pic.twitter.com/1TsHUrqelL

— Praveen Sattaru (@PraveenSattaru)
click me!