పట్టలేని సంతోషంలో నాగ్.. వాళ్లకు గ్రాండ్ పార్టీ!

By team teluguFirst Published Oct 22, 2021, 5:47 PM IST
Highlights

నాలుగవ ప్రయత్నంలో క్లీన్ హిట్ అందుకున్న అఖిల్ కెరీర్ పై నాగార్జునకు నమ్మకం  ఏర్పడింది.దీనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీమ్ కి వరుస పార్టీలు ఇస్తున్నారట కింగ్ నాగార్జున. 


స్టార్ కిడ్ గా పుట్టడం ఎంత అదృష్టమో ఆ స్టార్ డమ్ ని కొనసాగించడం, తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగడం అంత కష్టం. ఓ పెద్ద హీరో కొడుకుగా పుట్టి హీరోగా ఎదగకపోతే అది పెద్ద వైఫల్యంగా అందరూ భావిస్తారు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. అఖిల్ వెండితెర ఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగింది. వివి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ 30కోట్లకు పైగా బడ్జెట్ తో అఖిల్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత Akhil చేసిన హలో, మిస్టర్ మజ్ను సైతం అనుకున్నంత విజయం సాధించలేదు. 

హ్యాట్రిక్ పరాజయాలతో అఖిల్ తో పాటు నాగార్జున కూడా డీలా పడ్డారు. అఖిల్ ని స్టార్ గా నిలబెట్టగలనా అనే సందిగ్ధం, ఒత్తిడి ఆయనలో మొదలయ్యాయి. ఆ సమయంలో ఫార్మ్ లో లేని దర్శకుడు భాస్కర్ ని నమ్మాడు Nagarjuna. ఆయన చెప్పిన స్క్రిప్ట్ పై భరోసా ఉంచి, అఖిల్ నాలుగో సినిమా బాధ్యత అప్పగించాడు. భాస్కర్ సిద్ధం చేసిన స్క్రిప్ట్ కి నాగార్జున కొన్ని మార్పులు చేర్పులు సూచించారన్న వార్తలు కూడా వినిపించాయి. 

అనేక కారణాలతో Most eligible bachelor వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన హిట్ టాక్ తెచ్చుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వసూళ్లు ఊహకు అందని రీతిలో ఉన్నాయి. దసరా విన్నర్ గా నిలిచిన ఈ చిత్రం ఐదురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడం విశేషం. యూఎస్ లో సైతం భారీ వసూళ్లు రాబడుతుంది. 

నాలుగవ ప్రయత్నంలో క్లీన్ హిట్ అందుకున్న అఖిల్ కెరీర్ పై నాగార్జునకు నమ్మకం  ఏర్పడింది.దీనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీమ్ కి వరుస పార్టీలు ఇస్తున్నారట కింగ్ నాగార్జున. అఖిల్ ఇప్పటికే తన క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు చిత్ర యూనిట్ కి ఓ పార్టీ ఏర్పాటు చేయగా, కింగ్ నాగార్జున ఈ చిత్ర నిర్మాతలుగా ఉన్న అల్లు అరవింద్, బన్నీ వాసులతో పాటు చిత్ర యూనిట్ కి ప్రత్యేక విందు ఇవ్వనున్నారట. అఖిల్ మొదట హిట్ కొట్టిన ఆనందాన్నితన సన్నిహితులతో జరుపుకోవాలని అనుకుంటున్నారట. 

Also read కారులో షికారు కెళ్లిన అల్లు అర్జున్.. వెనకాల కూతురు అల్లు అర్హ ఏం చేస్తుందో తెలుసా?

కాగా నాగార్జున సైతం మొదట్లో వరుస ప్లాప్స్ అందుకున్నారు. ఆయన డెబ్యూ మూవీ విక్రమ్ తో పాటు కెప్టెన్ నాగార్జున, అరణ్య కాండ వరుసగా ప్లాప్ అయ్యాయి. దాసరి దర్శకత్వంలో నాగార్జున చేసిన నాలుగవ చిత్రం మజ్ను సూపర్ హిట్ కాగా, మొదటి విజయాన్ని అందించింది. 

Also read రహస్యంగా పెళ్లి, గర్భవతిని అంటూ ప్రకటన చేసిన స్లమ్ డాగ్ మిలియనీర్ హీరోయిన్

click me!