సాహసోపేతమైన పాత్ర కోసంయుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న నాగ్!

Published : Jun 17, 2021, 10:36 AM IST
సాహసోపేతమైన పాత్ర కోసంయుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న నాగ్!

సారాంశం

వైల్డ్ డాగ్ తరహాలో సాగే మరో యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సిద్ధం అవుతున్నాడు నాగార్జున. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రానికి నాగార్జున కమిట్ అయ్యారు. ఈ మూవీలో ఆయన సాహసోపేతమైన రోల్ చేయనున్నారట.


జయాపజయాల సంగతి ఎలా ఉన్నా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు కింగ్ నాగార్జున. ఈ ఏడాది వైల్డ్ డాగ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున, ఎన్ ఐ ఏ ఏజెంట్ గా అదరగొట్టారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించనప్పటికీ నిర్మాణ విలువలు, టేకింగ్ పరంగా ప్రశంసలు అందుకుంది. ఓటిటిలో మాత్రం వైల్డ్ డాగ్ కి మంచి స్పందన దక్కినట్లు వార్తలు వస్తున్నాయి.


కాగా వైల్డ్ డాగ్ తరహాలో సాగే మరో యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సిద్ధం అవుతున్నాడు నాగార్జున. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రానికి నాగార్జున కమిట్ అయ్యారు. ఈ మూవీలో ఆయన సాహసోపేతమైన రోల్ చేయనున్నారట. నాగ్ ఈ మూవీలో రా ఏజెంట్ గా కనిపిస్తారట. ఇక ఈ పాత్ర కోసం నాగ్ కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. ఆయన విదేశీ యుద్ధ విద్యలు అభ్యసిస్తున్నట్లు సమాచారం. 


మరి కింగ్ నాగార్జున డెడికేషన్ చూస్తుంటే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయినట్లు ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు బంగార్రాజు మూవీలో కూడా నాగార్జున నటించనున్నారు. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కుతుంది. ఈ మూవీపై పరిశ్రమలవు పాజిటివ్ బజ్ ఉంది. 

PREV
click me!

Recommended Stories

దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ