సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం: కరోనాతో కుమారుడి మృతి

Published : Jun 17, 2021, 06:56 AM IST
సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం: కరోనాతో కుమారుడి మృతి

సారాంశం

ప్రముఖ సినీ నటి కవిత ఇంట్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కరోనాతో పోరాడుతూ కవిత కుమారుడు మరణించారు ఆమె భర్త కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్: కరోనా వైరస్ సెకండ్ వేవ్ సినీ పరిశ్రమను కూడా పట్టి పీడిస్తోంది. ప్రముఖ సినీ నటి కవిత నివాసంలో కరోనా విషాదాన్ని నింపింది. ఆమె కుమారుడు సంజయ్ రూూప్ కరోనాతో కన్నుమూశారు. 

మరో వైపు ఆమె భర్తకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషా సినిమాల్లో కవిత నటించారు.

సినీ పరిశ్రమలో కవిత తనదంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్నారు. కవిత కుమారుడి మృతిపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?