Prabhas-Kiara Advani: ప్రభాస్ కి జంటగా కియారా అద్వానీ... తూచ్ అంటున్న హీరోయిన్ టీమ్!

Published : May 16, 2022, 06:12 PM IST
Prabhas-Kiara Advani: ప్రభాస్ కి జంటగా కియారా అద్వానీ... తూచ్ అంటున్న హీరోయిన్ టీమ్!

సారాంశం

ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో స్పిరిట్ ఒకటి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్ర హీరోయిన్ విషయంలో జోరుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 

అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించిన భారీ విజయం సొంతం చేసుకున్నారు. షాహిద్ కపూర్ హీరోగా విడుదలైన కబీర్ సింగ్ ఏకంగా రూ. 350 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఈ క్రమంలో ఆయనకు క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కుతున్నాయి. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆయనతో ఓ మూవీ ఓకే చేసిన విషయం తెలిసిందే. స్పిరిట్ (Spirit) టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. 

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్నారంటూ ఓ ప్రచారం చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో కియారా టీమ్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్-సందీప్ రెడ్డి మూవీకి సంబంధించి కియారాతో ఎటువంటి చర్చలు జరగలేదు. స్పిరిట్ మూవీలో కియారా హీరోయిన్ గా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఒక వేళ ప్రభాస్ తో కియారా నటించే అవకాశం వస్తే అధికారికంగా తెలియజేస్తాం... అంటూ ఆమె టీమ్ తెలియజేశారు. దీనితో స్పిరిట్ మూవీలో కియారా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ చెప్పినట్లయింది. 

ప్రస్తుతం తెలుగులో కియారా రామ్ చరణ్ (Ram Charan)తో జతకడుతున్నారు. దర్శకుడు శంకర్ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ రెండు భిన్నమైన పాత్రలు చేయడం విశేషం. ఇక ఆమె నటించిన బోల్ బులియన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ తో యానిమల్ మూవీ చేస్తున్నారు. ఇటీవల హిమాలయాలలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. 

ఇక ప్రభాస్ (Prabhas)సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అలాగే ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే మారుతీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీకి సిద్ధమవుతున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన సాహో, రాధే శ్యామ్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. దీనితో ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాలపై హైప్ నెలకొని ఉంది. ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా సలార్ 2023 సమ్మర్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు 30-35 శాతం షూటింగ్ పూర్తయింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు