నేనొక అనాథలా ఫీల్ అవుతున్నా.. ఖుష్బూ భావోద్వేగ ట్వీట్

Published : Aug 07, 2018, 10:11 PM ISTUpdated : Aug 07, 2018, 10:15 PM IST
నేనొక అనాథలా ఫీల్ అవుతున్నా.. ఖుష్బూ భావోద్వేగ ట్వీట్

సారాంశం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపై సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపై సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రిని పోగొట్టుకొని అనాధలా ఫీల్ అవుతున్నానని భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

'సూర్యుని కుమారుడు అస్తమించారు, మళ్లీ ఆయన ఉదయించరు. కరుణానిధి శకం ముగిసింది. తమిళనాడు ప్రజల మనసుల్లో ఆయన పేరు అల్లుకుపోయింది. ఓ మహానేతగా ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు' అంటూ ట్వీట్ చేసి నెల రోజుల క్రితం కరుణానిధితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''నెల రోజుల క్రితం ఆయనతో కలిసి దిగిన చివరి ఫోటో ఇది.

కానీ ఇదే చివరి ఫోటో అవుతుందని, ఆ మహానేతని చూసే చివరి క్షణం అవుతుందని నేను ఊహించలేదు. మిస్ యూ అప్పా'' అని ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ లో 'ఇప్పుడు నేనొక అనాధలా ఫీల్ అవుతున్నాను' అంటూ ఎమోషనల్ అయ్యారు. 
 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: కట్టలు తెచ్చుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా
30 కోట్ల రెమ్యునరేషన్, 300 కోట్లకుపైగా ఆస్తులు, 4000 కోట్ల బడ్జెట్ సినిమా చేస్తున్నహీరో?