
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం అధినేత ఎం.కరుణానిధి(94) మృతితో తమిళనాడు శోక సంద్రంలో మునిగిపోయింది. కొంతకాలగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్తతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ నటి రాధిక ట్విటర్ లో ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు.
'తమిళ ప్రజలు గర్వపడేలా కలైంజర్ పోరాటం సాగించారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయనిచ్చిన స్పూర్తి ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. తమిళ ప్రజలని దుఖసాగరంలోవదిలివెళ్లిన గ్రేట్ లీడర్ కి కన్నీటి వీడ్కోలు' అంటూ సంతాపం ప్రకటించారు. 1988లో రాధిక కీలకపాత్రలో నటించిన ‘పాసపరువైగల్’ అనే తమిళ చిత్రానికి కరుణానిధి రైటర్‌గా పనిచేశారు. రాధిక నటించిన పలు చిత్రాలకు కథలను కూడా అందించారు.