KGF2 Crazy Update: యష్‌ బర్త్ డే.. `కేజీఎఫ్‌`2 నుంచి క్రేజీ అప్‌డేట్‌

Published : Jan 07, 2022, 10:38 PM IST
KGF2 Crazy Update: యష్‌ బర్త్ డే.. `కేజీఎఫ్‌`2 నుంచి క్రేజీ అప్‌డేట్‌

సారాంశం

`కేజీఎఫ్‌ 2` నుంచి తాజాగా ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి రేపు శనివారం(జనవరి 8)న ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇవ్వబోతుంది యూనిట్‌.

పాన్‌ ఇండియా సినిమాల్లో `బాహుబలి` తర్వాత  ఆ స్థాయి క్రేజ్‌ని తెచ్చుకున్న సినిమా `కేజీఎఫ్‌`. మొదటి భాగం విడుదలై సంచలన విజయం సాధించింది. కన్నడంలో రూపొందిన ఓ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడం ఇదే ఫస్ట్ టైమ్‌. `కేజీఎఫ్‌` కన్నడ పరిశ్రమ సత్తా ఏంటో చూపించింది. యష్‌ స్టయిలీష్‌ యాక్టింగ్‌ సినిమాకి పెద్ద అసెట్‌. మొదటి భాగం ఊహించని విధంగా బ్లాక్‌ బస్టర్‌ సాధించడంతో రెండో భాగంపై ఆసక్తి నెలకొంది. ఇది ఇండియన్‌ గోల్డ్ మైనింగ్‌కి సంబంధించి కథ కావడం, యదార్థ సంఘటలుండటంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. 

ఇక `కేజీఎఫ్‌ 2` నుంచి తాజాగా ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి రేపు శనివారం(జనవరి 8)న ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇవ్వబోతుంది యూనిట్‌. యష్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం నుంచి శనివారం ఉదయం 9గంటలకు కొత్త పోస్టర్‌ని పంచుకోబోతుంది యూనిట్‌. రేపు యష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి ఓ క్రేజీ ట్రీట్‌ని ఇవ్వబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. మరో కొత్త పోస్టర్‌ మాత్రమే కాదు, అంతకు మించి మరో ట్రీట్‌ రాబోతుందని తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం `కేజీఎఫ్‌2` ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. 

యష్‌ హీరోగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయబోతున్నారు. ఇందులో సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్
తల్లి కాబోతున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్, బేబీ బంప్ ఫోటోస్ వైరల్